టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముద్దుల మనవడు దేవాన్ష్ గురించి అందరికీ తెలిసిందే. దేవాన్ష్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఏమైనా బయటకు వస్తే చాలు.. వాటిని అభిమానులు వైరల్ చేయకుండా మానరు. తాజాగా.. అలాంటి వీడియో ఒకటి బయటకు రాగా... సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఇంత చిన్న వయసులో అంత పరిపక్వత ఎలా వచ్చిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే.. కరోనా మహమ్మారి కారణంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు హైదరాబాద్ లోని తన ఇంటికే పరిమితమైపోయారు. నిత్యం ఇంట్లో నుంచే తాజా పరిస్థితులపై జూమ్‌లో వీడియో కాస్ఫరెన్స్ నిర్వహిస్తూ.. పార్టీ నేతలకు అందుబాటులో ఉంటున్నారు. కాగా తాజాగా.. చంద్రబాబు జూమ్‌లో శుక్రవారం సాయంత్రం ప్రెస్‌మీట్ నిర్వహించారు.. రాష్ట్ర ప్రస్తుత పరిస్తితులపై, అమరావతి అంశంపై మాట్లాడుతున్నారు.. అయితే ఈ ప్రెస్‌మీట్ లోకి ఆయన మనవడు దేవాన్ష్ వచ్చాడు.
            
ఇప్పుడు దీనికి సంబందించిన వీడియో వైరల్ గా మారింది. ప్రెస్‌మీట్ జరుగుతున్న సమయంలో తెలియకుండా వచ్చిన దేవాన్ష్.. వెంటనే దాన్ని గమనించి కెమెరాకు దొరక్కుండా జాగ్రత్తగా తాత పక్కకు జరిగాడు. అలా కింద పాక్కుంటూ వెళ్ళి తనకు కావలిసిన అక్బర్ బీర్బల్ పుస్తకం తీసుకుని వెళ్ళిపోతున్నాడు దేవాన్ష్.     

కాగా.. ఈ  వీడియో క్లిప్ ను కట్ చేసిన టీడీపీ శ్రేణులు దీన్ని నెట్టింట పెట్టగా, పలు కామెంట్లు వస్తున్నాయి. చిన్న వయసులోనే తాతయ్య బిజీగా ఉన్నారన్న విషయాన్ని తెలుసుకుని, చాలా క్రమశిక్షణతో దేవాన్ష్ మెలగుతున్నాడని, ఇది గొప్ప విషయమని కామెంట్లు పెడుతున్నారు.

తాతయ్యను డిస్ట్రబ్ చేయకూడదన్న విషయాన్ని దేవాన్ష్ తెలుసుకున్నాడని, చిన్న వయసులోనే పరిపక్వత సాధించాడని, ఇదేమీ మామూలు విషయం కాదని కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ వీడియోకు షేర్లు, లైక్స్ తెగ వచ్చేస్తున్నాయి. దాన్ని మీరూ చూసేయండి.