సోషల్ మీడియా వల్ల సమాచార వినిమయం ఎంత త్వరితగతిన అవుతుందో... అంతే త్వరితగతిన ఫేక్ న్యూస్, తప్పుడు ప్రచారాలు కూడా ఎక్కువయ్యాయి. ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడమనేది ఇప్పుడు సోషల్ మీడియాలో నిత్యకృత్యమైన సమస్యగా మారింది. 

వీరు వారు అనే తేడా లేకుండా ప్రతిఒక్కరు ఈ ట్రోలింగ్ బారిన పడుతున్నారు. తాజాగా బీజేపీ రాజ్యసభ ఎంపీ జివిఎల్ నరసింహారావు కూడా ఈ సోషల్ మీడియాలో చేసే తప్పుడు ప్రచారం బారినపడ్డారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసాడు. 

రామయ్య అనే వ్యక్తిపై ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నేతలు సీఐడీ డీజీ సునీల్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. జై తెలుగుదేశం, టీడీపీ యూత్ అనే పేర్లతో ఫేస్ బుక్ పేజీలలో రామయ్య తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

మూడు రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదంటూ, రాజధాని విషయం అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఆయన ను టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేసారని బీజేపీ నేతలు అంటున్నారు.