Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు కాకినాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. స్థానిక పోలీస్ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఎగరవేసి, గౌరవ వందనం స్వీకరించారు. 

Pawan Kalyan:భారతదేశం ఇవాళ 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను (Independence Day 2025) జరుపుకుంటోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు కాకినాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. స్థానిక పోలీస్ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఎగరవేసి, గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం అనేది కోట్లాది భారతీయుల త్యాగాల ఫలితమనీ, ఆ త్యాగాలను ఎల్లప్పుడూ స్మరించుకోవాలని అన్నారు. దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో సుపరిపాలన సాగుతుందని, ఎన్నికలలో ఇచ్చిన హామీలను సూపర్ సిక్స్ రూపంలో అమలు చేస్తున్నామని తెలియజేశారు. 

రాష్ట్రంలో తల్లికి వందనం పథకం ద్వారా ఈ ఏడాది రూ. 8000 కోట్లు తల్లుల అకౌంట్లో జమ చేశామని, దీపం పథకం కింద రెండు విడుదల ఒక కోటి గ్యాస్ వెళ్లినాలను ఉచితంగా అందజేశామని తెలియజేశారు. స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా నేడు శ్రీ శక్తి పేరుతో ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించబోతున్నామని ప్రకటించారు.

వైసిపీపై విమర్శలు

ఏపీలో 2019 నుండి 2024 వరకు చీకటి రోజులు కొనసాగాయాని, బ్రిటిష్ వారు ఎలా పరిపాలించారో.. గత ప్రభుత్వాలు కూడా అదే రీతిలో పరిపాలనను సాగించాయని ఘాటు విమర్శలు చేశారు. గత పాలకులు బ్రిటిష్ వారి డివైడ్ అండ్ రూల్ పద్ధతిలో పాలను కొనసాగిస్తే, తాము స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితో యునైటెడ్ అండ్ రూల్ పాలసీ లో పరిపాలన కొనసాగిస్తున్నామని తెలిపారు. కలిసి ఉందాం కలిసి పాలన చేద్దాం అనేది కూటమి ప్రధాన ఉద్దేశం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ఎంతోతమంది త్యాగ ఫలితాల వల్ల నేడు మనం స్వతంత్ర ఫలితాలను పొందుతున్నామని, స్వతంత్రం కోసం ఎంతోమంది తమ ప్రాణాలను అర్పించారని, వారి గురించి మన భావితరాలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. అయితే స్వతంత్ర పోరాటం అహింస పద్ధతిలోని కొనసాగిన పలుమార్లు సంఘటనలు జరిగాయని, ఎవరైతే తాను దేశం నుండి విడిపోదామని భావించినవారు హింసాగిత మార్గాలను ఎన్నుకున్నారని గుర్తు చేశారు. నేటికి కూడా అలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, ఇటీవల కాశ్మీర్లో మత ప్రాతిపదికన దాడులు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దాడిని మోడీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించిందని, ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్ర దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చామని పవన్ కళ్యాణ్ తెలియజేశారు.

భారతదేశం ఎప్పుడు లౌకిక దేశంగానే ఉందని, మతాల మధ్య ఈరోజు కూడా అభ్యంతరాలు చూపించలేదని అన్నారు. అందుకే డాక్టర్ అబ్దుల్ కలాం ఇలాంటివారిని రాష్ట్రపతి పదవిలో కూర్చుండబెట్టామని గుర్తు చేశారు. కానీ ఉగ్రదేశాలలో మత ప్రాతిపదిక దేశాలలో ఇలాంటి సంస్కృతి లేదని తెలియజేశారు. రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ అనేది స్పష్టంగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని, భారీ ఎత్తున విదేశీ పెట్టబడును కూడా వస్తాయని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ సుస్థిరంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతోఈ కూటమి ప్రభుత్వం దశాబ్దం పాటు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నామనీ, తమకు పదవులలో కూర్చొని ఎంజాయ్ చేయాలని, అధికారాన్ని ఆస్వాదించాలనే కోరిక తమకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు.

మరోవైపు కాంగ్రెస్ పై టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ఓడిపోతే ఏమో ఓటు చోరీ అని ప్రచారం చేస్తారని మరి గెలిస్తే అలాంటి ప్రచారాలు ఎందుకు చేయడం లేదని ఘాటుగా విమర్శించారు. గెలిస్తే ఓ న్యాయమా ఓడినప్పుడు మరో న్యాయమా అంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్. ప్రతిపక్షాలు విదేశీ శక్తులను దేశంలోకి వచ్చేలా చర్యలకు పాల్పడుతున్నారని, అలాంటి వాటివల్ల దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ప్రజలకు వీడిని సున్నితంగా పరిశీలించాల్సిన బాధ్యత ఉంది అని తెలియజేశారు.

ప్రతిపక్షాలు విదేశీ శక్తులకు కనుసైలలో బతుకుతున్నారని వారికి అనుగుణంగా ప్రతిపక్షాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయని ఆరోపించారు. అలాగే కాకినాడలో జరుగుతున్న అక్రమ రవాణా పై కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు కూడా తమకు సహకరించాలని, తమ దృష్టికి వచ్చిన దుశ్చర్యలను పోలీసులకు చేరవేయాలని పవన్ కళ్యాణ్ మనవి చేశారు. కాకినాడలో జరిగిన ఈ వేడుకల్లో పోలీస్ దళాలు, ఎన్‌సీసీ, స్కౌట్స్‌ & గైడ్స్‌ పరేడ్‌ నిర్వహించాయి. వివిధ ప్రభుత్వ విభాగాలు తమ అభివృద్ధి ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేశాయి. స్థానిక ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు.