Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు… అందుకే ఆయన ఇవాళ (మంగళవారం) అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదని తెలుస్తోంది.
Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, సినీ హీరో పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారినపడ్డారు. గత రెండ్రోజులుగా ఆయన అనారోగ్యంతో ఇబ్బందిపడుతూనే వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు. నిన్న(సోమవారం) కూడా ఆయన జ్వరంతోనే అసెంబ్లీ సమావేశాలకు, అధికారులతో సమీక్షలకు హాజరైనట్లు తెలుస్తోంది. ఇలా విరామం లేకుండా పనిచేయడంతో రాత్రికి జ్వరం తీవ్రత పెరిగినట్లు సమాచారం. దీంతో ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించి వైరల్ ఫీవర్ గా నిర్దారించారు. తగిన విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో పవన్ కల్యాణ్ ఇవాళ (మంగళవారం) ఇంటికే పరిమితం అయినట్లు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం.
వర్షంలో తడవటం వల్లేనా జ్వరం?
పవన్ కల్యాణ్ కొంతకాలంగా అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో చాలా బిజీగా ఉంటున్నారు. అయితే గత రెండుమూడు రోజులు ఆయన మరింత బిజీ అయ్యారు. ఒకేసారి అసెంబ్లీ సమావేశాలు, తన ఓజి (OG) సినిమా కార్యక్రమాలు వచ్చాయి. తాజాగా ఓజి ప్రీరిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ తడుస్తూనే పాల్గొన్నారు. ఇలా వర్షంలో తడవడంవల్లే అనారోగ్యం బారిన పడివుండవచ్చని అభిమానులు భావిస్తున్నారు.
మెగా ఫ్యాన్ ఆందోళన
ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ మెడిసిన్స్ తీసుకుంటున్నారని... జ్వరం తీవ్రత పెరిగితే హాస్పిటల్ కు వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రెండుమూడు రోజులపాటు ఆయన రాజకీయ, సినీ కార్యమాలన్నింటికి దూరం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఓజి సినిమా రిలీజ్ జోష్ లో ఉన్న మెగా ఫ్యాన్స్ కి పవన్ కల్యాణ్ అనారోగ్యం బాధపెట్టే సమాచారం. సినిమా రిలీజ్ నాటికి అభిమాన హీరో పూర్తి ఆరోగ్యంతో తమ ముందుకు వస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
