Asianet News TeluguAsianet News Telugu

డిప్యూటి సిఎం కెఇ అధికారాలను లాక్కున్న సిఎం

డిప్యూటి కలెక్టర్ల ట్రాన్సపర్ అధికారాలను రెవిన్యూ మంత్రి  కెఇ నుంచి లాక్కున్న ముఖ్యమంత్రి బాబు

Deputy CM KE stripped of his crucial authority in AP

అంతంత మాత్రం ప్రతిష్టతోపనిచేస్తున్న  ఆంధప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ మంత్రి కెఇ కృష్ణమూర్తి అధికారాల మీద ముఖ్యమంత్రి కోత విధించారు.  రెవిన్యూ శాఖ పరిధిలో నుంచి డిప్యూటి కలెక్టర్ల, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ల బదిలీ, పోస్టింగుల అధికారాలను సాధారణ పరిపాలనా శాఖ(జిఎడి) కు బదిలీ చేశారు. దీనితో డివిజన్ స్థాయి రెవిన్యూ అధికారుల వ్యవస్థ  మొత్తం రెవిన్యూ మంత్రి పరిధినుంచి జిఎడి అంటే ముఖ్యమంత్రి కార్యాలయం పరిధిలోకి వెళ్లి పోతుంది.

 

ఇపుడు  కెఇ కృష్ణమూర్తి దగ్గిర ఉన్న ఎకైక విశేషాధికారం ఇదే. ఆయన పరిధిలోనుంచి డిప్యూటి కలెక్టర్ల బదిలీలను, పోస్టింగులను తీస్తసే, ఆయనను ఇక ఎవరూ ఖాతరుచేయరు. అదే విధంగా రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా డిప్యూటికలెక్టర్లు ఖాతరు చేయడం మానేస్తారు.

 

ఈ చర్య పట్ల డిప్యూటి సిఎం ఎ లా స్పందిస్తారోచూడాలి.

 

ఇప్పటికే ఆయన నామమాత్రం రెవిన్యూమంత్రి. రికార్డుల డిజిటైజేషన్ వంటి ఐటి కార్యక్రమాలు చూస్తుంటారు. భూములకు సంబంధించిన వ్యవహారాలన్ని ముఖ్యమంత్రి కార్యాలయంలోకే వెళ్లిపోయాయి.

 

అమరావతి నిర్మాణం కోసం సిఆర్ డిఎ (క్యాపిటల  రీజియన్ డెవెలప్ మెంట్ అధారిటీ) ఏర్పాటుచేసి,రెవిన్యూఅధికారాలను కూడా ఆ సంస్థకే ఇచ్చాక, అమరావతిప్రాంతంలో కెఇ కృష్ణమూర్తికి పనే లేకుండా పోయింది. కొన్ని వేల ఎకరాల భూములను   సిఆర్ డిఎ సమీకరిస్తున్నా కెఇకి ఎలాంటి పాత్ర లేకుండా పోయింది.

 

 ఈ మధ్య డిప్యూటీ కలెక్టర్ల బదిలీలలో పెద్ద ఎత్తున  డబ్బులు చేతులు మారాయనే ఫిర్యాదులు రావడంతో ముఖ్యమంత్రి  ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. మొదట  డిప్యూటి కలెక్టర్ల బదిలీలకు సంబంధించిన పైళ్లను ముఖ్యమంత్రి పరిశీలనకు పంపాలని చెప్పారు. ఇపుడు ఏకంగా  ఈ అధికారాలను మొత్తంగా జిఎడికి మార్చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు బిజినెస్ రూల్స్ అండ్  సెక్రెటేరియట్ ఇన్ స్ట్రక్షన్స్ ను సవరించాలని  కొత్త చీఫ్ సెక్రెటరీ అజేయ కల్లాం ఆదేశాలు జారీ చేశారు.

 

ఇంతవరకు జిల్లాలలో జాయింట్ కలెక్టర్ల బదిలీ వరకు మాత్రమే జిఎడి అజమాయిషీ వుండేది. ఇపుడు డివిజన్ స్థాయి రెవిన్యూ అధికారుల బదిలీ దాకా ఈ అధారిటీ విస్తరించింది. ఇక రెవిన్యూమంత్రికి మిగిలింది ఎమ్మార్వోలే...

 

వచ్చే క్యాబినెట్ మార్పుల్లో  ఈ శాఖను కెయి నుంచి తప్పించి మరొక నోరు లేని జీవానికి ఇస్తారని, అందుకే ఇలా జరుగుతూ ఉందని రెవిన్యూ శాఖలో గుసగుసలు వినపడుతున్నాయి.

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios