విశాఖపట్నం: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం కొనసాగుతోంది. ఇది రానున్న రెండురోజుల్లో మరింతగా స్పష్టత పొందుతుంది.బంగాళాఖాతం నుంచి తేమతో నిండిన తూర్పు పవనాలు తీరం మీదుగా ఉత్తరభారతానికి వీస్తున్నాయి.

వీటన్నిటి ప్రభావంతో నేడూ రేపూ కోస్తాంధ్ర, యానం, తెలంగాణల్లో అక్కడక్కడ భారీ నుంచి విస్తారంగా వర్షాలు పడతాయి. రాయలసీమకు చెదురుమదురు వర్షాలు పడతాయి.నేడు తెలంగాణకన్నా కోస్తాంధ్రలో అధికవర్షాలు పడవచ్చు.

రేపు ఉభయ రాష్ట్రాలకూ భారీ వర్షసూచన ఉంది.ఉత్తరబంగాళాఖాతం, దాన్ని ఆనుకున్న ప్రాంతాల్లో 50-60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. 
మత్స్యకారులు ఆప్రాంతాల్లోకి వెళ్లరాదని వాతావరణశాఖ హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల భారీ వరదలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో జనావాసాలు నీట మునిగాయి.