గిడ్డికి చుక్కలు చూపించిన గ్రామస్తులు (వీడియో)

First Published 4, Jan 2018, 4:46 PM IST
Defection mla giddy Eeswari faces rough treatment from villagers
Highlights
  • ఫిరాయింపు ఎంఎల్ఏ గిడ్డి ఈశ్వరికి జనాలు చుక్కులు చూపించారు

ఫిరాయింపు ఎంఎల్ఏ గిడ్డి ఈశ్వరికి జనాలు చుక్కులు చూపించారు. వైసిపి నుండి టిడిపిలోకి ఫిరాయించిన దగ్గర నుండి గిడ్డి నియోజకవర్గమైన పాడేరుకు పెద్దగా వెళ్ళటం లేదు. అందుకు కారణమేంటంటే జనాల్లో వ్యతిరేకతే.    

ఇంతకీ ఏం జరిగిందంటే జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఎంఎల్ఏ పాడేరు నియోజకవర్గంలోని వణుగుపల్లి గ్రామానికి వస్తున్నట్లు జనాలకు తెలిసింది. గిడ్డిని కలిసేందుకని చుట్టుపక్కలున్న 21 గ్రామాల్లోని ప్రజలు అక్కడికి చేరుకున్నారు. మరి కొంతమందేమో కందమామిడి జంక్షన్ వద్ద ఎంఎల్ఏని చూడగానే జనాలు కారును నిలిపారు. ఇక్కడే గిడ్డిఈశ్వరికి చేదు అనుభవం ఎదురైయింది.

ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీ రోడ్డు నిర్మాణంపై గ్రామస్దులు గురువారం రోడ్డుపైనే ఎమ్మెల్యేను నిలదీశారు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కనీసం 108 వాహనాలు వచ్చేందుకు వీలు లేకపోవడంతో గర్బిణిలు చనిపోతున్నారంటూ గ్రామస్ధులు ఎమ్మెల్యేపై మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటంపై ధ్వజమెత్తారు. తామంతా వైసీపికి ఓట్లేసి గెలిపిస్తే టిడిపిలోకి చేరిన ఎమ్మెల్యేపై నమ్మకం లేదంటూ గిరిజనులు నిరసన తెలిపారు.

మూకమ్ముడిగా తనపై గ్రామస్తులు దాడి చేసినట్లుగా భావించిన గిడ్డి కూడా జనాలపై మండిపడ్డారు. పార్టీ మారగానే రోడ్లు వచ్చేస్తాయా అంటూ ఎదురు ప్రశ్నించారు.  అయినా జనాలు ఎంఎల్ఏని వదలకపోవటంతో స్పందించిన ఎంఎల్ఏ నెల రోజుల వ్యవదిలో రోడ్డు సౌకర్యాన్ని కల్పించలేకపోతే రాజీనామా చేస్తాననంటూ గ్రామస్దులకు హామీ ఇచ్చారు. అయినా గ్రామస్తులు శాంతిచకపోవటంతో చేసేదిలేక పోలీసుల సాయంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు.

 

loader