విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోజుల చిన్నారి మృతి, సిబ్బంది వ్యవహరంపై అనుమానాలు...
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అప్పుడే పుట్టిన చిన్నారిని తారుమారు చేశారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయి పుడితే అబ్బాయి అని చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన చిన్నారికి పాలు పట్టిస్తామని తీసుకెళ్లి అంతలోనే చనిపోయిందని చెప్పడంతో.. సిబ్బంది వ్యవహారంపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు చిన్నారి చేతికి వేసిన ట్యాగ్ కూడా అనుమానాలకు తావిస్తోంది. విజయవాడలోని తల్లి పిల్లల హాస్పిటల్ లో ఓ మహిళ ఈనెల 8వ తేదీన కవలలకు జన్మనిచ్చింది.
గంగాభవాని అనే మహిళ కంకిపాడు నుంచి డెలివరీ కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో జాయిన్ అయింది. అదే రోజు ఆమెకు ప్రసవం అయ్యింది. కాన్పులో ఆమెకు కవలలు జన్మించారు. కవలల్లో ఒక బిడ్డకు ఆరోగ్యం బాగాలేదని చెప్పిన ఆస్పత్రి సిబ్బంది ఐసియూలో పెట్టారు. ఇంకో బిడ్డకి ఆరోగ్యం బాగానే ఉందని చెప్పి తల్లి దగ్గరే ఉంచారు. శుక్రవారం ఉదయం తల్లి దగ్గర ఉన్న చిన్నారికి పాలు పట్టించడానికి ఆస్పత్రి సిబ్బంది తీసుకెళ్లారు.
వైఎస్ జగన్ చేతకాని దద్దమ్మ... అందుకే ప్రధాని అలా చేసారు..: సిపిఐ రామకృష్ణ
ఆ తరువాత కాసేపటికే చిన్నారి చనిపోయిందంటూ తల్లిదండ్రులకు సమాచారం అందించారు ఆస్పత్రి సిబ్బంది. అయితే, చిన్నారిని చూసిన తల్లిదండ్రులు తమ బేబీ కాదంటూ ఆరోపిస్తున్నారు. తమకు పుట్టింది అమ్మాయని.. చనిపోయిన పాప బాడీకి అబ్బాయి ట్యాగ్ వేసి ఉందని.. అంతేకాదు బేబీ చేతికి రెండు టాగ్స్ ఉన్నాయని చెబుతున్నారు. మరొకవైపు చనిపోయిందని చెప్పి.. తమ పాప అంటూ అప్పగించిన బేబీకి ఫింగర్ ప్రింట్స్ తీసుకున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయని.. తమ దగ్గర నుంచి బేబీని తీసుకుని సమయంలో ఫింగర్ ప్రింట్స్ తీసుకోలేదని చెబుతున్నారు. ఆస్పత్రి సిబ్బంది వ్యవహారం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.