విజయనగరం: బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద దొంగలు చేతివాటం చూపించారు. ఓ ప్రయాణికుడు బురిడీ కొట్టించి భారీ చోరీకి పాల్పడ్డారు. ప్రయాణికుడి బ్యాగు నుంచి రూ.5 లక్షల రూపాయలను చాకచక్యంగా కొట్టేశారు దుండగులు. 

భార్యతో కలిసి బొబ్బిలి నుంచి అమలాపురం వెళ్తున్నాడు కొబ్బరికాయలు వ్యాపారి శ్రీనివాసరావు.  అమలాపురంలోని కొబ్బరికాయల వ్యాపారికి బకాయి చెల్లించడానికి రూ.5లక్షలు ఓ బ్యాగులో తీసుకెళుతున్నారు. ఈ విషయాన్ని దోపిడీ దొంగలు ముఠా గుర్తించింది. దీంతో అత్యంత చాకచక్యంగా దంపతుల ద్రుష్టి మళ్లించి మొత్తం సొమ్మును దోచుకున్నారు. 

కష్టపడి సంపాదించిన భారీ నగదు దొంగతనానికి గురవడంతో బాధిత భార్యాభర్తలు లబోదిబమంటున్నారు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆర్టీసి కాంప్లెక్స్ సమీపంలోని సిసి కెమెరా పుటేజీని పరిశీలిస్తున్నారు.