ఏ దేశం నుండి ఏ మేరకు పెట్టుబడులు వచ్చాయో, ఏరంగంలో వచ్చాయో తెలుసుకోవాలని ప్రజలకుంటుంది కదా. ప్రభుత్వం ఆపని చేస్తే ప్రతిపక్షాల నోళ్ళు కూడా మూయించినట్లవుతుంది.
దావోస్ పర్యటన ఫలితాలపై రాష్ట్రవ్యప్తంగా చర్చ మొదలైంది. ఎందుకంటే, దావోస్ కేంద్రంగా ప్రతీ ఏటా జరిగే ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయడుకు మళ్ళీ ఆహ్వానం అందటమే కారణం. ఇప్పటికే రెందు సార్లు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు దావోస్ కు వెళ్లి వచ్చారు. ప్రంపంచానికి నూతన రాజధాని అమరావతిని పరిచయం చేస్తున్నామని, నవ్యాంధ్రకు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతొనే పర్యటనలు చేస్తున్నట్లు ప్రతీ పర్యటన సందర్భంగాను ప్రభుత్వం చెబుతోంది. ఈ సారి కూడా పర్యటన ఉద్దేశ్యం అదేనని చెబుతోంది ప్రభుత్వం.
మరి రెండు సార్లు వెళ్లి వచ్చిన తర్వాత ఏమేరకు ఫలితాలు కనిపించాయి అన్న విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేస్తే బాగుంటుంది కదా. ఎందుకంటే, మనదే అసలే పేద రాష్ట్రం. ముఖ్యమంత్రే ఈ విషయాన్ని అనేకమార్లు బహిరంగంగానే చెప్పారు. అసలే పేద రాష్ట్రం అనుకుంటుంటే విదేశీ పర్యటనల పేరుత మరింత భారాన్ని ఖజానాపై మోపం ఎవరికీ భావ్యం కాదు. పైగా విదేశాలంటే చంద్రబాబు వెంట పెద్ద బృందమే ఉంటుంది. అందరికీ ఖర్చులు అంటే తడిసి మోపడవుతుంది.
నవ్యాంధ్రను కొత్తగా ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఇపుడు లేదు. గతంలో రెండు సార్లు చంద్రబాబు చేసిందదే. గత రెండు పర్యటనల్లోనూ యావత్ ప్రపంచం దృష్టిని నవ్యాంధ్రవైపుకు తిప్పిన కారణంగా ఏ దేశం నుండి ఏ మేరకు పెట్టుబడులు వచ్చాయో, ఏరంగంలో వచ్చాయో తెలుసుకోవాలని ప్రజలకుంటుంది కదా. ప్రభుత్వం ఆపని చేస్తే ప్రతిపక్షాల నోళ్ళు కూడా మూయించినట్లవుతుంది.
బ్రాండ్ ఏపికి సర్వం తానే అయి నడిపిస్తున్న ముఖ్యమంత్రి తలచుకుంటే ప్రపంచ దేశాల నుండి పెట్టుబడులను ఆకర్షించటం పెద్ద విశేషం కాదని టిడిపి వర్గాలే చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో జరిగిన సదస్సులో ‘సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో ఏపిలో పెట్టుబడులను పెట్టమని పలుదేశాలను దావోస్ వేదికగా ఆహ్వానించారు కూడా.
రక్షణ, వైమానిక, ఇంధన, ఆతిధ్య, వైద్య పరికరాల తయారీ, మౌళిక సదుపాయాల కల్పన, బహుళార్ధ ఆర్ధిక సంస్ధలు, రవాణా, కన్సల్టింగ్, ఐటి సెక్టార్లలో ప్రపంచ దగ్గజ సంస్ధలతో పోయిన సదస్సులో చంద్రబాబు విడివిడిగా ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించారు. చంద్రబాబు సామర్ధ్యంపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న ప్రజలు నవ్యాంధ్రకు పెట్టుబడుల వరద వస్తాయని ఎదురుచూస్తున్నారు.
వచ్చే జనవరిలో దావోస్ పర్యటనకన్నా ఒక్క రోజు ముందే జ్యూరిచ్ వెళ్ళి అక్కడి అంతర్జాతీయ వాణిజ్యవేత్తలు, పెట్టుబడిదారులతో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. ప్రపంచ పెట్టుబడుల ఆకర్షణయాత్రకు అక్కడి నుండి శ్రీకారం చుట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.
