విజయ్ ఎలక్ట్రికల్స్ అధినేత దాసరి జైరమేష్ శుక్రవారం నాడు  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను కలిశారు. 

హైదరాబాద్: విజయ్ ఎలక్ట్రికల్స్ అధినేత దాసరి జైరమేష్ శుక్రవారం నాడు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను కలిశారు. ఐదు మాసాలుగా దాసరి జై రమేష్ వైసీపీ నేతలతో టచ్‌లో ఉన్నారు. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి దాసరి జై రమేష్ లోట‌స్‌ పాండ్‌లో జగన్‌ను కలిశారు.

విజయవాడ పార్లమెంట్ స్థానం నుండి దాసరి జై రమేష్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి శుక్రవారం నాడు లోటస్‌పాండ్‌లో జగన్‌తో దాసరి జైరమేష్ భేటీ అయ్యారు.

విజయవాడలో వైసీపీ శంఖారావంలో దాసరి జై రమేష్ ఆ పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం.

సంబంధిత వార్తలు

జగన్‌తో నేడు భేటీ: విజయవాడ ఎంపీ సీటు ఆయనదే