విజయ్ ఎలక్ట్రికల్స్ అధినేత దాసరి జై రమేష్ శుక్రవారం నాడు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు
హైదరాబాద్: విజయ్ ఎలక్ట్రికల్స్ అధినేత దాసరి జై రమేష్ శుక్రవారం నాడు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. విజయవాడ పార్లమెంట్ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా దాసరి జై రమేష్ పోటీ చేసే అవకాశం ఉంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
విజయవాడ పార్లమెంట్ స్థానం నుండి బలమైన అభ్యర్థి కోసం వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో వైసీపీలో చేరేందుకు దాసరి జై రమేష్ ఆసక్తి కనబర్చారు.
విజయ్ ఎలక్ట్రికల్స్ అధినేత దాసరి జై రమేష్ శుక్రవారం నాడు హైద్రాబాద్‌లోని లోటస్ పాండ్‌లో సాయంత్రం నాలుగు గంటలకు జగన్‌ను కలవనున్నారు. వైసీపీ చీఫ్ జగన్ సమక్షంలో దాసరి జై రమేష్ కలవనున్నారు. జగన్ సమక్షంలోదాసరి జై రమేష్ వైసీపీలో చేరిన వెంటనే విజయవాడ ఎంపీ సెగ్మెంట్‌కు ఆయనను ఇంచార్జీగా జగన్ ప్రకటించే ఛాన్స్ ఉంది.
