పశ్చిమ గోదావరి జిల్లాలో దళితులను స్తంభానికి కట్టేసిన ఘటన కలకలం రేపుతోంది. జీలుగు మిల్లి మండలం పీ. అంకం పాలెంలో పిల్లల మధ్య గొడవ ఘర్షణకు దారి తీసింది.

దీంతో ముగ్గురు దళితుల్ని స్తంభానికి కట్టి కొట్టారు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. అయితే తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడం లేదని వాపోతున్నారు బాధితులు. ప్రస్తుతం సదరు దళితులు జంగారెడ్డి గూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.