Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్రపతి భవన్‌కు సజ్జల రాజకీయ రంగు పులిమారు.. పురందేశ్వరి ఫైర్

ఆంధ్రప్రదేశ్‌లోని హిందూ దేవాలయాల ట్రస్టు బోర్డులలో అన్యమతస్తులను నియమిస్తున్నారని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్న పట్టించుకోవడం లేదన్నారు.

daggubati purandeswari slams sajjala ramakrishna reddy comments ksm
Author
First Published Aug 31, 2023, 12:45 PM IST

టీటీడీ వంటి హిందూ దేవాలయాల ట్రస్టు బోర్డులలో అన్యమతస్తులను నియమిస్తున్నారని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్న పట్టించుకోవడం లేదన్నారు. గురువారం విజయవాడలో బీజేపీ  ఆధ్వర్యంలో శంఖానాదం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బీజేపీ సోషల్ మీడియా , ఐటి ప్రతినిధులకు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. పేదల కోసం కేంద్రం గ్యాస్ రూ. 200 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటే దానిని రాజకీయం అనడం తగదని చెప్పారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి కుటుంబం అంతా వెళ్లి హాజరయ్యామని తెలిపారు. అయితే కుటుంబం అంతా వెళ్లి ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదలలో పాల్గొంటే తప్పుపడతారా? అని ప్రశ్నించారు. 

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. రాష్ట్రపతి పాల్గొన్న కార్యక్రమాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. రాష్ట్రపతి భవన్‌కు రాజకీయ రంగు పులిమారాని మండిపడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై తాను స్పందిచనని అన్నారు. ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదలపై ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారని.. వాటికి తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. 

అన్యమతస్తులను దేవాలయ పాలక మండళ్లలో పెడుతున్నారని మండిపడ్డారు. దేవాలయాల వద్ద సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టామని చెప్పారు. బీజేపీ చేపట్టిన ‘నా భూమి, నాదేశం‌’ కార్యక్రమంలో భాగంగా.. వచ్చే నెల 1 నుంచి 15 వరకు గ్రామాల్లో మట్టిసేకరణ కార్యక్రమం చేపడతామని.. సేకరించిన మట్టిని ఢిల్లీకి తీసుకెళ్తామని తెలిపారు.  అక్కడ అన్ని రాష్ట్రాల మట్టితో అమృత వనం ఏర్పాటు చేస్తామని పురంధేశ్వరి స్పష్టం చేశారు. పార్టీ జాతీయ నాయకత్వం  నుంచి నుంచి వచ్చిన పిలుపు మేరకే మట్టి సేకరణ కార్యక్రమం చేపడుతున్నట్టుగా స్పష్టం చేశారు. పంచాయితీల నిధుల మళ్లింపుపై సర్పంచులు, జనసేనతో  కలిసి  ఆందోళన చేశామని అన్నారు. పంచాయితీ నిధుల వ్యవహారంపై గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios