తెలుగుదేశంలోకి దాడి వీరభద్రరావు: బాబుతో అపాయింట్‌మెంట్ ఫిక్స్


మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తన ఇద్దరు కొడుకులతో కలిసి తెలుగు దేశం పార్టీలో చేరనున్నారు.  ఇవాళ వైఎస్ఆర్‌సీపీకి దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు.

Dadi veerabhadra rao likely to join in Telugu desam party soon lns

అమరావతి: మాజీ మంత్రి దాడి వీరభద్రరావు  ఈ నెల 3వ తేదీన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ కానున్నారు.  మంగళవారంనాడు వైఎస్ఆర్‌సీపీకి దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు.  దాడి వీరభద్రరావుతో పాటు ఆయన ఇద్దరు తనయులు  కూడ వైఎస్ఆర్‌సీపీని వీడారు. ఈ నెల 3న దాడి వీరభద్రరావు  తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ కానున్నారు.  తెలుగు దేశం పార్టీలో చేరనున్నారు దాడి వీరభద్రరావు. 

తెలుగు దేశం పార్టీలో  పలు కీలక పదవులను  దాడి వీరభద్రరావు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  2014 వరకు  తెలుగు దేశంలో దాడి వీరభద్రరావు కీలక నేత.  తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా అప్పట్లో పనిచేశారు.   2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు  నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీ కోసం పేరుతో పాదయాత్ర నిర్వహించారు.ఈ పాదయాత్రను చంద్రబాబు విశాఖపట్టణంలో ముగించారు. ఈ పాదయాత్ర ముగించిన రోజునే దాడి వీరభద్రరావు వైఎస్ఆర్‌సీపీలో చేరాల్సి ఉంది.  కానీ, ఈ పాదయాత్ర ముగింపు సభ ముగిసిన తర్వాత దాడి వీరభద్రరావు  టీడీపీని వీడి వైఎస్ఆర్‌సీపీలో చేరారు.  2014  అసెంబ్లీ ఎన్నికల్లో  దాడి రత్నాకర్ తనయుడు దాడి రత్నాకర్ విశాఖపట్టణం సిటీ నుండి  వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.  ఆ తర్వాత కొంతకాలానికే  వైఎస్ఆర్‌సీపీని వీడి  తెలుగు దేశం పార్టీలో చేరారు దాడి వీరభద్రరావు. 

also read:కాంగ్రెస్‌లో వైఎస్ఆర్‌టీపీ విలీనం: రాజ్యసభకు వై.ఎస్. షర్మిల

2019 మార్చి మాసంలో దాడి వీరభధ్రరావు తన ఇద్దరు కొడుకులతో కలిసి  వైఎస్ఆర్‌సీపీలో చేరారు.  వైఎస్ఆర్‌సీపీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా దాడి  వీరభద్రరావును  వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం నియమించింది. 2024 ఎన్నికల్లో  దాడి రత్నాకర్ కు  టిక్కెట్టు కేటాయింపు విషయంలో వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం నుండి స్పష్టమైన హామీ లభించలేదు. అనకాపల్లి నుండి వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్టును  దాడి వీరభద్రరావు  తనయుడు రత్నాకర్ ఆశించారు. కానీ, ఈ విషయమై  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  దాడి రత్నాకర్ కు హామీ లభించలేదు.దీంతో దాడి వీరభద్రరావు తన అనుచరులతో  ఇవాళ  సమావేశమయ్యారు.  వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేశారు. రేపు  చంద్రబాబు, నారా లోకేష్ తో  దాడి వీరభద్రరావు, ఆయన ఇద్దరు కొడుకులు సమావేశం కానున్నారు.

also read:కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల: తెలుగు దేశానికి దెబ్బేనా?

2014 ఎన్నికలకు ముందు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో  దాడి వీరభద్రరావు విపక్ష నేతగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు  వస్తున్నా మీ కోసం పాదయాత్ర నిర్వహించే సమయంలో పార్టీ కార్యక్రమాల్లో  దాడి వీరభద్రరావు కీలకంగా వ్యవహరించారు. 

తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో దాడి వీరభద్రరావు కొనసాగారు. సినీ రంగంలో కూడ దాడి వీరభద్రరావుకు  ప్రవేశం ఉంది.  సినీ నటుడు రావు గోపాలరావుతో  దాడి వీరభద్రరావుకు మంచి సంబంధాలున్నాయి. 

also read:వైసీపీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు.. జగన్ కు ఏకవ్యాఖ్య రాజీనామా లేఖ..

1995 లో తెలుగు దేశం పార్టీ సంక్షోభం సమయంలో దాడి వీరభద్రరావు  ఎన్‌టీఆర్ వైపు ఉన్నారు. ఆ తర్వాత ఆయన  చంద్రబాబు వైపునకు వచ్చారు.  చంద్రబాబు వైపునకు వచ్చిన తర్వాత  పార్టీలో కీలకంగా వ్యవహరించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios