సైబర్ నేరగాళ్లు కూడా స్టైల్ మార్చారు. సీజనల్ వ్యాపారాల్లాగా, సీజనల్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ట్రెండింగ్‌లో ఉండటంతో జనాన్ని ఈజీగా నమ్మించేలా ప్లాన్ చేశారు.

టీకా రిజిస్ట్రేషన్ చేస్తామంటూ ఫోన్లు చేస్తున్నారు. కరోనా టీకా కోసం ఫోన్‌లో ఆధార్, ఓటీపీ నెంబర్లు అడుగుతున్నారు. దీంతో అలర్ట్ అయిన ఏపీ పోలీసులు ఇలాంటి వారిని అసలు నమ్మొద్దని సూచించారు. కరోనా వ్యాక్సిన్ పేరుతో ఎవరైనా ఓటీపీలు, ఆధార్ నెంబర్ అడిగితే ఇవ్వొద్దని సూచిస్తున్నారు. 

కాగా, కరోనా వ్యాక్సిన్‌ పంపిణీనికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. ఇందుకు అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చుకుంటోంది. గన్నవరంలోని వ్యాధినిరోధక కేంద్రానికి 30 లక్షల డిస్పోజబుల్‌ సిరంజీలు చేరుకున్నాయి.

వ్యాక్సిన్‌ నిల్వ చేసుకునేందుకు అవసరమైన ఐస్‌ కోల్డ్‌ రిఫ్రిజిరేటర్లును ప్రభుత్వం తెప్పించింది. రాష్ట్రంలో కోటి మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది.