Asianet News TeluguAsianet News Telugu

ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఈ నెల 28న అకౌంట్లలో నగదు జమ.. సీజన్ ముగియకముందే పరిహారం పంపిణీ..

ఆంధ్రప్రదేశ్ రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2022 ఖరీఫ్ సీజన్లో పంటలు దెబ్బతిన్న రైతులకు ఆ సీజన్ ముగియకముందే ఇన్పుట్ సబ్సిడీ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 

crop damage compensation Cash will be deposited in farmers accounts on 28th of this month in andhra pradesh
Author
First Published Nov 25, 2022, 9:02 AM IST

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రైతులకు జగనన్న సర్కార్ తీపి కబురు చెప్పింది.2022 ఖరీఫ్ సీజన్లో వివిధ ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్నపంటలు గాను రైతులకు పంట నష్టపరిహారం అందించనుంది. ఆ సీజన్ ముగియకముందే ఇన్పుట్ సబ్సిడీ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో వచ్చిన గోదావరి వరదలతోపాటు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు కురిసిన అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 45,998మంది రైతులకు చెందిన 60,832 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లుగా గుర్తించింది. ఇందులో 20 జిల్లాల పరిధిలో 21,799 మంది రైతుల 34,292 ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 14 జిల్లాల పరిధిలో 24,199 మంది రైతుల 26,540 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 12,886 ఎకరాల్లో,  అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 42.5 ఎకరాల్లో రైతులు నష్టపోయారు.

వ్యవసాయ పంటల్లో 11,742 రెండు ఎకరాల్లో వరి, 5,205 ఎకరాల్లో  పత్తి, 4,887ఎకరాల్లో వేరుశనగ, 3,915 ఎకరాల్లో పెసర…ఉద్యాన పంటలలో ఏడు వేల ఎకరాల్లో ఉల్లి, 1,525 ఎకరాల్లో మిరప, 439 ఎకరాల్లో కూరగాయలు, 399 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.  వ్యవసాయ పంటలకు18.95 కోట్లు, ఉద్యాన పంటలకు 20.44కోట్లు చొప్పున మొత్తంగా రూ.59.39కోట్లు  పంట నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ అధికారులు లెక్క తేల్చారు. ఈ మేరకు ఇప్పటికే జిల్లాల వారీగా రైతుల జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు.

దారుణం...పోలీసుల పరిధుల పంచాయతీ.. ఏట్లోనే నానుతున్న మృతదేహం...

వరదలు,  అకాల వర్షాలు వంటి వివిధ వైపరీత్యాల వల్ల 2019-20 సీజన్లో 1.47 లక్షల మందికి రూ.116.63 కోట్లు, 2020-21 సీజన్లో 12.15 లక్షల మందికి రూ.932.07  కోట్లు, 2021-22 సీజన్లో 6.32 లక్షల మందికి రూ.564 కోట్లు చొప్పున  గత మూడేళ్లలో 20.85 లక్షల  మందికి రూ.1,795.4 కోట్ల పంట నష్టపరిహారం అందించారని వివరాలు వెల్లడించారు.

2022-23లో ఖరీఫ్ సీజన్కు సంబంధించి ప్రస్తుతం 45,998 మంది రైతులకు సబ్సిడీ అందనుంది. ఈ మేరకు ఈనెల 28న రూ.39.39 కోట్లు ఇవ్వనున్నారు. అదే రోజు 2020-21 రబీ సీజన్కు సంబంధించి 2.54 లక్షల మందికి రూ.45.22కోట్లు, 2021  ఖరీఫ్ సీజన్కు సంబంధించి 5.68 లక్షల మందికి ర కిూ.115.33కోట్లు చొప్పున మొత్తంగా 8.2 రెండు లక్షల మందికి రూ.160.55 కోట్లు  సున్నా వడ్డీ జమ చేయనున్నారు.  పంట నష్టపరిహారం, సున్నా వడ్డీ కలిపి  మొత్తం రూ.199.94 కోట్లను  సీఎం వైయస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios