కాకినాడ డీప్ వాటర్ పోర్టులో శనివారం ఉదయం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఓడలలో నుంచి సరుకులను కిందకు దించేందుకు ఉపయోగించే ఆఫ్ షోర్ క్రేన్లు రెండు కుప్పకూలాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో పది మందికి గాయాలయ్యాయి. శిథిలాల కింద మరికొంత మంది కార్మికులు చిక్కుకున్నారు.

ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకి చెందిన లక్ష్మణ్(35)గా గుర్తించారు. గాయపడిన పదిమందిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవల సంభవంచిన తుపాను కారణంగా దెబ్బతిన్న క్రేన్ ను రిపేర్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.