Asianet News TeluguAsianet News Telugu

డ్వాక్రా మహిళలకు ఇచ్చే రూ.10వేలు మళ్లీ వసూలు చేస్తారా..? : సీపీఎం మధు

విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన పసుపు కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలకు ఇస్తున్న రూ.10వేలు రుణమా లేక ఉచితంగా ఇస్తున్నారా అన్న దానిపై స్పష్టత లేదన్నారు. పథకం జీవోలో ఎలాంటి స్పష్టత లేకపోవడం చూస్తుంటే మళ్లీ అధికారంలోకి వస్తే మహిళల దగ్గర నుంచి ఆ డబ్బులు వసూలు చేస్తారా అంటూ ప్రశ్నించారు. 

cpm leader madhu demonds ap government clarify on pasupu kumkuma scheme
Author
Vijayawada, First Published Jan 30, 2019, 3:43 PM IST

విజయవాడ : పసుపు కుంకుమ పథకంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో చంద్రబాబు తాయిలాలు ప్రకటిస్తున్నారంటూ విమర్శించారు. 

విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన పసుపు కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలకు ఇస్తున్న రూ.10వేలు రుణమా లేక ఉచితంగా ఇస్తున్నారా అన్న దానిపై స్పష్టత లేదన్నారు. పథకం జీవోలో ఎలాంటి స్పష్టత లేకపోవడం చూస్తుంటే మళ్లీ అధికారంలోకి వస్తే మహిళల దగ్గర నుంచి ఆ డబ్బులు వసూలు చేస్తారా అంటూ ప్రశ్నించారు. 

మరోవైపు జయహో బీసీల పేరుతో చంద్రబాబు బీసీలను మోసం చేస్తున్నారని విమర్శించారు. విజయవాడలో 20 వేల మంది ఇళ్లకోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం 1200 ఇళ్లు మాత్రమే నిర్మించారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు, బీజేపీతో ములాఖత్‌ అయ్యి ప్రత్యేకహోదాను గాలికోదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

హోదా కోసం పోరాడుతున్న తమపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగబోతున్న అఖిలపక్ష భేటీ వల్ల విధానపరంగా ఎటువంటి ఉపయోగం ఉండదని అందువల్లే తాము ఆ సమావేశానికి దూరంగా ఉంటున్నట్లు సీపీఎం మధు స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios