అమరావతి: ప్రత్యేక హోదాపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో  అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కోరారు. 

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి  రామకృష్ణ మంగళవారం నాడు లేఖ రాశారు. ఏపీ సహా ఏ రాష్ట్రానికి కూడ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

బీహార్ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆమె ఈ సమాధానం ఇచ్చారు.ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇచ్చేది లేదని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ను రామకృష్ణ కోరారు. ప్రధానమంత్రి మోడీ వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని ఆయన కోరారు.