Asianet News TeluguAsianet News Telugu

తెలుగు ప్రజల కోసం ఆ ఒక్కటి చేయండి...లాక్ డౌన్ పొడిగింపు లోపే: కిషన్ రెడ్డికి సిపిఐ రామకృష్ణ లేఖ

మరోసారి లాక్ డౌన్ పొడిగించే ముందు తెలుగు రాష్ట్రాల్లోని వలస కూలీల గురించి ఓసారి ఆలోచించాలంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి ఏపి సిపిఐ కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. 

CPI Ramakrishna Open  Letter to Central Home Minister Kishan Reddy
Author
Amaravathi, First Published Apr 13, 2020, 12:42 PM IST

విజయవాడ: కరోనా విజృంభణ కారణంగా లాక్ డౌన్ ను దేశవ్యాప్తంగా మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం వుండటంతో అంతకంటే ముందే వలస కూలీలను సమస్యలను పరిష్కరించాలంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. వలస కూలీలపై కేంద్రం వివక్షను ప్రదర్శిస్తోందంటూ రామకృష్ణ మండిపడ్డారు. 


''ఏపీలో ఇతర ప్రాంతాల్లో ఉన్న వలస కూలీలను స్వస్థలాలకు పంపడంలో వివక్ష ఎందుకు? ఇటలీ నుండి 33 మంది విద్యార్ధులను తీసుకురావడంలో మీరు, వారణాసి నుండి 1000 మంది యాత్రికులను ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావడంలో ఎంపి జివిఎల్ నరసింహారావు గారు చొరవ చూపారు. మరి వలసకూలీలను ఇలా ఎందుకు ఆదుకోవడం లేదు'' అని ప్రశ్నించారు. 

''ఇటీవల గుంటూరు జిల్లాలో ఉన్న కర్నూలుకు చెందిన వలస కూలీలను కర్నూలుకు వెళ్ళనీయకుండా మార్గమధ్యం నుండి పోలీసులు వెనక్కి తిప్పి పంపారు. హైదరాబాద్, బెంగళూరులో ఉన్నవలస కూలీలను స్వస్థలాలకు చేర్చేందుకు ఆటంకాలు కల్పిస్తున్నారు. మీరు తక్షణమే  లాక్ డౌన్ పొడిగించేలోపు ఆంధ్ర, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి వలసకూలీలను స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నాం'' అని కిషన్ రెడ్డికి రాసిన లేఖలో రామకృష్ణ పేర్కొన్నారు. 


 
 

Follow Us:
Download App:
  • android
  • ios