చంద్రబాబు అరెస్ట్ .. మోడీ, అమిత్ షాలకు తెలియకుండా జగన్ ఈ స్టెప్ వేయలేడు : సీపీఐ నారాయణ
ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలకు తెలియకుండా చంద్రబాబును జగన్ అరెస్ట్ చేయగలరా అని వ్యాఖ్యానించారు సీపీఐ నేత నారాయణ. దీని వెనుక ఎవరున్నారో చంద్రబాబు ఇప్పటికైనా తెలుసుకోవాలని నారాయణ హితవు పలికారు.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ నేత నారాయణ. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలకు తెలియకుండా చంద్రబాబును జగన్ అరెస్ట్ చేయగలరా అని వ్యాఖ్యానించారు. అమిత్ షా అనుమతితోనే చంద్రబాబును జగన్ అరెస్ట్ చేశారని.. తాను ఛాలెంజ్ చేసి చెబుతున్నానని నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని వెనుక ఎవరున్నారో చంద్రబాబు ఇప్పటికైనా తెలుసుకోవాలని నారాయణ హితవు పలికారు. తనను బీజేపీ కాపాడుతుందని ఆయన భ్రమల్లో వున్నారని.. ఇప్పటి రాజకీయాలు ఏంటో చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. బీజేపీ సాయం లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం సాధ్యం కాదన్నారు.
అంతకుముందు శనివారం నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు అరెస్టు వైఎస్సార్ పార్టీ అరాచక పాలనకు పరాకాష్ట అని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పనిచేసిన వ్యక్తిని ఎటువంటి ఆధారాలు చూపించకుండా పోలీసులు అరెస్ట్ చెయ్యడం వైకాపా దుర్మార్గపు పాలనకు అద్దం పడుతోందన్నారు.
ALso Read: చంద్రబాబు అరెస్ట్.. ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్.. తీవ్ర ఉత్కంఠ..
వైకాపా పాలనలో రెండు రకాల పాలన సాగుతోందన్నారు.అందులో ఒకటి రివర్స్ టెండెరింగ్, రెండోది రివేంజ్ పాలన చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యం ను పక్కన పెట్టి పరిపాలన కొనసాగిస్తుండడం దుర్మార్గం అన్నారు.వైకాపా ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలలో భాగంగా చంద్రబాబు ను అరెస్ట్ చెయ్యడం సీపీఐ తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.