చంద్రబాబు అరెస్ట్.. ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్.. తీవ్ర ఉత్కంఠ..
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారంపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారంపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి బృందం వాదనలు వినిపిస్తుండగా.. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్దార్థ లూథ్రా, పోసాని వెంకకటేశ్వరరావు వాదనలువినిపిస్తున్నారు. అయితే ఇరుపక్షాల వాదనలు వాడివేడిగా సాగాయి.
చంద్రబాబు కస్టడీకి ఇవ్వాల్సిందిగా సీఐడీ కోరగా.. రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్దార్థ లూద్రా వాదించారు. సుదీర్ఘంగా సాగిన వాదనలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. దీంతో ఏసీబీ న్యాయమూర్తి నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు. మరికాసేపట్లో న్యాయమూర్తి తీర్పును వెలువరించే అవకాశం ఉంది. అయితే న్యాయమూర్తి నిర్ణయం ఏ విధంగా ఉంటుందోననే ఉత్కంఠ నెలకొంది.
Also Read: 409 సెక్షన్ నమోదుపై వాడివేడిగా వాదనలు.. చంద్రబాబును ప్రభుత్వం టార్గెట్ చేసిందన్న లూథ్రా..
ఇక, చంద్రబాబును నంద్యాలలో శనివారం తెల్లవారుజామున సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి విజయవాడకు తరలించారు. ఈ క్రమంలోనే పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే శనివారం తెల్లవారుజామున విజయవాడ కోర్టు కాంప్లెక్స్‌లోని ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపరిచారు. కోర్టులో 28 పేజీలతో కూడిన రిమాండ్ రిపోర్టు కూడా సీఐడీ సమర్పించింది. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు పేరుమీద రిమాండ్ ఈ రిపోర్టు సమర్పించారు. ఇక, ఈ కేసుకు సంబంధించి 2021లో పేర్కొన్న ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు. అయితే తాజాగా ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరును చేర్చారు.
రిమాండ్ రిపోర్టులో.. చంద్రబాబును ఏ-37గా సీఐడీ పేర్కొంది. నేరపూరిత కుట్ర, నిధుల దుర్వినియోగంపై అభియోగాలు మోపింది. ప్రజా సేవకుడిగా చంద్రబాబు తన స్థానాన్ని దుర్వినియోగం చేశారని సీఐడీ ఆరోపించింది. ప్రజాప్రతినిధిగా ఉండి చంద్రబాబు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సీఐడీ ఆరోపించింది. డిజైన్ టెక్, సీమన్స్ ఎండీలతో కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ అభియోగాలు చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్‌లో చంద్రబాబును ప్రధాన కుట్రదారుగా పేర్కొంది. వివిధ అక్రమాల్లో ఆయన పాత్ర ఉందంటూ.. విచారణ చేసేందుకు 15 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని కోరింది.
Also Read: నేను ఏ తప్పు చేయలేదు.. రాజకీయ కక్షతోనే అభియోగాలు: ఏసీబీ కోర్టులో స్వయంగా చంద్రబాబు వాదనలు
ఇక, విచారణ సందర్భంగా ఏసీబీ కోర్టులోవ వాడివేడిగా సాగాయి. అరెస్ట్ చేసిన 24 గంటల్లోపు కోర్టులో హాజరుపరుచడం, 409 సెక్షన్ నమోదు, చంద్రబాబు అరెస్ట్‌కు గవర్నర్ అనుమతి.. ఇలా అంశాలపై ఇరుపక్షాల మధ్య వాదనలు కొనసాగాయి. అయితే న్యాయమూర్తి అనుమతితో చంద్రబాబు కూడా స్వయంగా కోర్టులో తన వాదన వినిపించారు.