దేశంలో బీజేపీ హవా గాలివాటమేనన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారడాన్ని ఆయన స్వాగతించారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం సీపీఐ తలపెట్టిన పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు నారాయణ తెలిపారు.
కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం సీపీఐ తలపెట్టిన పాదయాత్ర వాయిదాపడింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. తుఫాను, వాతావరణ పరిస్ధితుల కారణంగా పాదయాత్రను తాత్కాలికంగా రద్దు చేస్తున్నామన్నారు. రాజకీయాలపై పోరాటం చేయగలంకానీ.. ప్రకృతిపై చేయలేమని నారాయణ వ్యాఖ్యానించారు. తమ పాదయాత్రకు బీజేపీ, వైసీపీ మినహా అన్ని పార్టీలు మద్ధతుగా నిలిచాయన ఆయన తెలిపారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం త్వరలో చలో రాయలసీమ నిర్వహిస్తామని నారాయణ వెల్లడించారు.
ఉమ్మడి పౌరసత్వ బిల్లుకు సీపీఐ వ్యతిరేకమన్న ఆయన.. ఇది ఆమోదం పొందితే దేశం ఒక్కటిగా వుండదని హెచ్చరించారు. ఈ బిల్లుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి తన విధానం తెలియజేయాలని నారాయణ డిమాండ్ చేశారు. మరోవైపు టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారడాన్ని ఆయన స్వాగతించారు. బీఆర్ఎస్‌తో ముందుకు సాగే అవకాశం... కేసీఆర్ వైఖరిని బట్టి వుంటుందన్నారు. ఈ నెల 29న సీపీఐ జాతీయ సమావేశాలు నిర్వహిస్తామని నారాయణ వెల్లడించారు. అటు గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని ఈ నెల 29న దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. దేశంలో బీజేపీ హవా అనేది గాలివాటంగా నారాయణ అభివర్ణించారు. హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఓటమికి మోడీపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ALso Read:కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేయలేరు.. రెండు రాష్ట్రాలను కలుపుతాడా : జగన్‌పై సీపీఐ నారాయణ ఫైర్
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ మళ్లీ కలిస్తే స్వాగతిస్తామంటూ వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణకు చెందిన పలువురు నేతలు కూడా స్పందించారు. తాజాగా నారాయణ మాట్లాడుతూ... సొంత జిల్లాలో ఉక్కు పరిశ్రమ పూర్తి చేయలేని వ్యక్తి రెండు రాష్ట్రాలను కలుపుతాడా అంటూ సీఎం జగన్‌పై మండిపడ్డారు. కడప స్టీల్ ప్లాంట్ సాధన కోసం సీపీఐ శుక్రవారం పాదయాత్రను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నారాయణ హాజరయ్యారు. జమ్మలమడుగు నుంచి కడప కలెక్టరేట్ వరకు నాలుగు రోజుల పాటు ఈ పాదయాత్ర జరగనుంది.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. కడప స్టీల్ ప్లాంట్ శిలాఫలకాలకే పరిమితమైందని దుయ్యబట్టారు. ఏ అదానికో అప్పగిస్తే వారైనా పూర్తి చేసేవారంటూ ఆయన హితవు పలికారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రధానిని సీఎం జగన్ నిధులు అడగటడం లేదన్నారు. ఇప్పుడు మరోసారి సమైక్యవాదాన్ని లేపుతున్నారని నారాయణ మండిపడ్డారు.
