తమ కామవాంఛలకు మహిళలు, చిన్నారులను బలి చేస్తున్న మృగాళ్లు తాజాగా మూగ జీవులను వదలడం లేదు. అత్యంత పవిత్రంగా, గోమాతగా పూజలందుకునే ఆవుపై కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు.

వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం గోకివాడకు చెందిన నామా బుచ్చిరాజు అనే రైతుకు పశువులు ఉన్నాయి. వాటిని బి.కొత్తూరు రోడ్డులోని తన పశువుల పాకలో ఉంచేవాడు.

శనివారం రాత్రి తన మూడు ఆవులు, రెండు గిత్తలు, ఒక దూడను కట్టేసి ఇంటికొచ్చి పడుకున్నాడు. అయితే తెల్లవారుజామున పాక వద్దకు వెళ్లి చూడగా పశువులు కనిపించలేదు. అటు ఇటు వెతకగా... తాడిచెట్టుకు కట్టేసి ఉన్న తన ఆవు ఒకటి కదల్లేని స్థితిలో కనిపించింది.

మూడు నెలల గర్భంతో ఉన్న ఆవు మర్మాంగం వద్ద రక్తపు గాయాలు కనిపించడంతో లైంగికదాడి జరిగినట్టు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశువైద్యాధికారి సైతం అత్యాచారం జరిగిందని నిర్థారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.