Asianet News TeluguAsianet News Telugu

కష్టపడి ఆసుపత్రికొస్తే.. మెట్లపైనే కుప్పకూలిన మహిళ: విశాఖలో హృదయ విదారక ఘటన

విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో బెడ్స్ కొరతతో కరోనా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. బెడ్లు దొరక్కపోవడంతో ఆసుపత్రి బయటే ప్రాణాలు వదులుతున్నారు. తీవ్ర అనారోగ్యంతో కేజీహెచ్‌కు వచ్చిన ఓ మహిళ.. ఆసుపత్రి మెట్ల మీదే ప్రాణాలు కోల్పోయింది.

covid patient died in front of kgh hospital visakhapatnam ksp
Author
Visakhapatnam, First Published Apr 24, 2021, 4:25 PM IST

విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో బెడ్స్ కొరతతో కరోనా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. బెడ్లు దొరక్కపోవడంతో ఆసుపత్రి బయటే ప్రాణాలు వదులుతున్నారు. తీవ్ర అనారోగ్యంతో కేజీహెచ్‌కు వచ్చిన ఓ మహిళ.. ఆసుపత్రి మెట్ల మీదే ప్రాణాలు కోల్పోయింది.

కొందరు పేషెంట్లు అంబులెన్స్‌లోనే బెడ్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. కరోనాతో ఎవ్వరైనా మృతి చెందినా మృతదేహాలను తరలించేందుకు అంబులెన్స్‌లు కూడా దొరకని పరిస్ధితి నెలకొంది. దీంతో మృతదేహాలను ఆసుపత్రిలోనే వదిలిపెట్టి వెళ్లిపోతున్నారు. 

Also Read:కరోనా భయంతో నీటి సంపులో దూకి ఆత్మహత్య: శవాన్ని తీయడానికి వెనకంజ

మరోవైపు విశాఖపట్నంలో కరోనా సెకండ్ వేవ్ మరణ మృదంగం మ్రోగిస్తోంది. రాత్రి.. పగలు అనే తేడా లేకుండా స్మశాన వాటికలలో చితి మంటలు ఆరని చిచ్చులా నిరాటంకంగా కాలుతునే ఉన్నాయి .

సాధారణ రోజుల్లో రోజుకు నాలుగైదు మృతదేహాలకు దహన క్రియలు జరిగే స్మశాన వాటికలకు ఇప్పుడు కనీసం 20 వరకు మృతదేహాలు క్యూ కడుతున్నాయి. ఒక్కో సారి తమ వారి అంత్యక్రియలు పూర్తి చేసుకుని తిరిగి వెళ్లేందుకు బంధువులు ఒక రోజంతా స్మశానం దగ్గరే వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios