Asianet News TeluguAsianet News Telugu

కరోనా వ్యాక్సిన్ : యువడాక్టర్ కు తీవ్ర అస్వస్థత.. చెన్నై అపోలోకి తరలింపు..

కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తరువాత అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో కరోనా వ్యాక్సిన్ వికటించి యువ డాక్టర్ ధనలక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 

covid 19 vaccine doctor health condition critical - bsb
Author
Hyderabad, First Published Jan 27, 2021, 3:36 PM IST

కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తరువాత అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో కరోనా వ్యాక్సిన్ వికటించి యువ డాక్టర్ ధనలక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 

ఫ్రంట్ లైన వారియర్స్ కు వ్యాక్సిన్ లో భాగంగా ఒంగోలు జీజీహెచ్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నడాక్టర్ ధనలక్ష్మి ఈ నెల 23న కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.  తీసుకున్న తెల్లారే అంటే జనవరి 24 నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో జీజీహెచ్‌లో ఆమెకు చికిత్స అందించారు. 

అయినా జ్వరం తగ్గకపోవడంతో, సంఘమిత్ర ఆస్పత్రిలో చికిత్స అందించినా ఫలితం లేకుండాపోయింది. జ్వరం తగ్గకపోగా ఎక్కువైపోయింది. ఒక్కసారిగా బీపీ తగ్గిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన జీజీహెచ్ వైద్యులు చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రి సంఘమిత్రకు తరలించారు. అయితే అక్కడ కూడా ఫలితం లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం డాక్టర్ ధనలక్ష్మిని చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు.

Follow Us:
Download App:
  • android
  • ios