అక్రమాస్తుల కేసుల్లో వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఊరట లభించింది. జగన్ పై ఉన్న కేసుల్లో భాగంగా జగన్ మీడియాకు సంబంధించిన ఆస్తులను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎటాచ్ చేసింది. దాంతో చాలా కాలంగా వివిధ రూపాల్లో జగన్ అవస్తులు పడుతున్నారు. అటువంటిది తాజాగా విచారణలో భాగంగా ఎటాచ్ చేసిన జగన్ మీడియా ఆస్తులను వెంటనే విడుదల చేయాలని  ఈడిని ఆదేశించింది.  జగన్ పై మోపిన అభియోగాలను నిరూపితం కాలేదు కాబట్టి ఆస్తుల ఎటాచ్ చేయటం సబబు కాదని తన ఆదేశాల్లో పేర్కొంది.