Asianet News TeluguAsianet News Telugu

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మండలి ఛైర్మన్, అసెంబ్లీ కార్యదర్శి, సీఎస్

మండలి ఛైర్మన్ షరీఫ్,అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాధ్ దాస్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. 

council chairman, assembly secretary, cs taken corona vaccine
Author
Amaravathi, First Published Mar 24, 2021, 1:12 PM IST

అమరావతి: ఏపీ శాసన మండలి ఆవరణలో మండలి ఛైర్మన్ ఎం.ఎ షరీఫ్ బుధవారం కోవ్యాక్జిన్ టీకా తీసుకున్నారు. ఆయనతో పాటు అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు కోవిషీల్డ్ వ్యాక్సిన్ టీకా తీసుకున్నారు. అనంతరం అసెంబ్లీ లో ఉన్న పలువురు సహాయ కార్యదర్శులు,అసిస్టెంట్ కార్యదర్శులు,ఉద్యోగులు,మార్షల్స్ కోవిడ్ వ్యాక్సిన్ ను తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో గుంటూరు డిఎంహెచ్ వొ యాస్మిన్, గుంటూరు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామింగ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రత్నమన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
 
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. అమరావతి సచివాలయంలోని డీస్పెన్సరీలో కొవాక్సిన్ ఇంజక్సన్ మొదటి డోస్ వేయించుకున్నారు. ఇవాళ మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించుకున్న వారు నాలుగు వారాల అనంతరం ఇదే వ్యాక్సిన్ రెండవ డోస్ వేయించుకోవాల్సి ఉంటుంది.

ఇదిలావుంటే రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్న క్రమంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది వైసిపి ప్రభుత్వం.  ఆంధ్రప్రదేశ్ లో కరోనా నివారణ, వ్యాక్సినేషన్ వేగవంతంపై తీసుకోవాల్సిన చర్యలపై వైద్యారోగ్య శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి. కరోనా ప్రమాదం గురుంచి ప్రజలకు మరింత ప్రచారం నిర్వహించడం కోసం అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు రూపొందించాలని అధికారులకు మంత్రులు ఆదేశించారు. వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం కోసం అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

 అన్ని జిల్లాల్లో కరోనా కట్టడికి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం జిల్లా కలెక్టర్లు పరిధిలో అన్ని ప్రభుత్వ శాఖలు అధికారులతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. కరోనా కట్టడిలో అన్ని వాణిజ్య, వ్యాపార, ప్రజా సంఘాలు, డ్వాక్రా సంఘాలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కల్పించాలని సూచించారు. జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో అధికారులు ప్రజాప్రతినిధులు, భాగస్వామ్యం చేస్తూప్రజలకు అవగాహన కోసం అన్ని చర్యలు తీసుకుందామన్నారు. 

 అన్ని హోటల్స్, షాపింగ్ మాల్స్, విద్యా సంస్థల్లో, మత సంస్థల్లో కరోనా నియంత్రణపై పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించాలన్నారు. గ్రామ, పట్టణ, మండల స్థాయిలో క్యాండిల్ ర్యాలీలు నిర్వహించి కరోనా నివారణకు ప్రజలను చైతన్య పరచాలన్నారు. 

కరోనా వ్యాక్సిన్ రోజుకి కనీసం 3లక్షలు పై బడి వేయాలని లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయలతో పాటు,1930ప్రభుత్వ హాస్పిటల్స్, 634ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ లో యధావిధిగా టీకా ప్రక్రియ కొనసాగిస్తామన్నారు. కరోనా టీకా తీసుకున్న వారికీ ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే 104,108అంబులెన్సు అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ వేసే ముందు గ్రామాల్లో, పట్టణాల్లో, మైక్ ద్వారా ప్రచారం చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రులకు అధికారులు తెలిపారు. 

 
 

Follow Us:
Download App:
  • android
  • ios