వంగవీటి రాధా హత్యకు రెక్కీ: గుట్టుగా విచారణ, పోలీసుల అదుపులో కార్పోరేటర్..?

వంగవీటి రాధాకృష్ణ హత్యకు రెక్కీ అంశంపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. విజయవాడకు చెందిన ఓ కార్పోరేటర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రాధాతో నిన్న రాత్రి పోలీసులు ఫోన్‌లో మాట్లాడి కొన్ని వివరాలు సేకరించారు. రాధా సన్నిహితుల నుంచి ఇంటెలిజెన్స్ వర్గాలు వివరాలు సేకరించాయి. 

corporater arrest in tdp leader vangaveeti radha assassination conspiracy case

వంగవీటి రాధాకృష్ణ హత్యకు రెక్కీ అంశంపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. విజయవాడకు చెందిన ఓ కార్పోరేటర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రాధాతో నిన్న రాత్రి పోలీసులు ఫోన్‌లో మాట్లాడి కొన్ని వివరాలు సేకరించారు. రాధా సన్నిహితుల నుంచి ఇంటెలిజెన్స్ వర్గాలు వివరాలు సేకరించాయి. అనుమానిత ఆధారాల కోసం ముమ్మర విచారణ కొనసాగుతోంది. మరోవైపు తనకు గన్‌మెన్‌లు వద్దని రాధా పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గన్‌మెన్‌లను పంపుతామని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. 

కాగా.. తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారని సంచలన ఆరోపణలు చేసిన vangveeti Radhaకు రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీని కల్పించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2+2 సెక్యూరిటీని కల్పించాలని సీఎం Ys Jagan పోలీస్ అధికారులను ఆదేశించారు. తన పై కుట్ర జరుగుతోందని, తనని చంపడానికి రెక్కి నిర్వహించారని రాధా ఆ దివారం నాడు గుడివాడలో అన్నారు. అయితే దీనికి సంబంధించిన ఆధారాలు సేకరించి రిపోర్ట్ ఇవ్వాలని ఇంటిలిజెన్స్ డీజీపీ ని సీఎం జగన్ ఆదేశించారు.

Also Read:నా హత్యకు రెక్కీ: వంగవీటి రాధాకు 2+2 సెక్యూరిటీ కేటాయింపు

వంగవీటి రంగా 33 వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం నాడు  రంగా విగ్రహన్ని ఆవిష్కరించిన అనంతరం వంగవీటి రాధా మాట్లాడారు. తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారన్నారు. ఈ రెక్కీ ఎవరు చేశారోననే విషయం త్వరలోనే తేలుతుందన్నారు.తన హత్యకు కుట్రపన్నారని.. ఈ మేరకు రెక్కీ కూడా నిర్వహించారంటూ ఆయన ఆరోపణలు చేశారు. 

రంగా  ఆశయాల సాధనే తన లక్ష్యమన్నారు. పదవులపై తనకు ఎలాంటి ఆశ లేదని ఆయన తెలిపారు. తనను పొట్టన పెట్టుకోవాలని అనుకునేవారికి భయపడేది లేదని వంగవీటి రాధా స్పష్టం చేశారు. తాను ప్రజల మధ్యే వుంటానని, నన్ను లేకుండా చేయాలనుకునే వారిని ప్రజలు దూరం పెట్టాలని రాధా పిలుపునిచ్చారు. తన సమక్షంలో నే వంగవీటి రాధా ఈ  వ్యాఖ్యలు చేయడంతో ఈ విషయమై మంత్రి కొడాలి నాని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే వంగవీటి రాధాకు 2 ప్లస్ 2 గన్ మెన్స్ కేటాయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios