Asianet News TeluguAsianet News Telugu

ఏపీ సర్కార్ వినూత్న నిర్ణయం: ఎస్ఎంఎస్ ద్వారా కరోనా టెస్టు రిజల్ట్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా టెస్టుల ఫలితాన్ని ఇక నేరుగా శాంపిల్స్ సేకరించిన వ్యక్తి సెల్‌ఫోన్‌కే పంపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
 

coronavirus results to get through sms to mobile in Andhra pradesh
Author
Amaravathi, First Published Jun 10, 2020, 12:02 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా టెస్టుల ఫలితాన్ని ఇక నేరుగా శాంపిల్స్ సేకరించిన వ్యక్తి సెల్‌ఫోన్‌కే పంపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

ఏపీ రాష్ట్రంలో ఎక్కువగా కరోనా టెస్టులను నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో టెస్టులు నిర్వహిస్తున్నందున ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు కూడ నమోదౌతున్నాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖాధికారులు ప్రకటించారు.

also read:ఏపీలో 5 వేలు క్రాస్ చేసిన కరోనా : కొత్తగా 216 కేసులు, ఇద్దరి మృతి

అయితే రాష్ట్రంలో కరోనా పరీక్షల నిర్వహణ కోసం శాంపిల్స్ సేకరించిన వారి సెల్‌ఫోన్ కు ఎస్ఎంఎస్ ద్వారా రిజల్ట్స్ ను పంపనున్నారు. కరోనా నిర్దారణ ఫలితాలు వెల్లడించే విధానంలో కొన్ని లోపాలు తలెత్తుతున్నతరుణంలో  ఎస్ఎంఎస్ ద్వారానే సంబంధిత వ్యక్తికి సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. మంగళవారం నుండి ఈ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.

కరోనా టెస్టులు నిర్వహించిన రెండు రోజుల తర్వాత ఫలితం వస్తోంది. ఈ రిజల్స్ట్ ను ఆన్ లైన్ ద్వారా సంబంధిత ఆసుపత్రి వైద్యులు, ఆసుపత్రి సూపరింటెండ్లకు సమాచారం ఇస్తారు. అయితే ఈ క్రమంలోనే కొన్ని సమస్యలు ఎదురౌతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. దీంతో పరీక్షల కోసం శాంపిల్స్ తీసుకొన్న వ్యక్తి సెల్ ఫోన్ కు ఎస్ఎంఎస్ ద్వారా పలితాన్ని పంపుతున్నారు.

అంతేకాదు వైద్య ఆరోగ్య శాఖ పరీక్షలు చేయించుకొన్న వ్యక్తి ఫోన్ కు పంపే లింకు ద్వారా కరోనా టెస్టు ఫలితాన్ని తెలుసుకొనే అవకాశం ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖాధికారులు ప్రకటించారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios