Asianet News TeluguAsianet News Telugu

గుంటూరు జిల్లాలో కరోనా పంజా: టీచర్ తో పాటు 14 మంది చిన్నారులకు కరోనా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా భట్లూరు గ్రామంలో కరోనా పంజా విసిరింది. ఓ ట్యూషన్ సెంటర్ టీచర్ తో పాటు 14 మంది చిన్నారులకు కరోనా వైరస్ సోకింది. దాంతో వారిని క్వారంటైన్ కు తరలించారు.

Coronavirus infected to tution teacher along with 14 children in Guntur district KPR
Author
Guntur, First Published Oct 2, 2020, 9:15 AM IST

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో కరోనా పంజా విసిరింది. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి మండలం భట్లూరులో ఓ ట్యూషన్ టీచర్ కు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. టీచర్ తో పాటు 14 మంది విద్యార్థులకు కరోనా పాజిటి వచ్చింది.

విద్యార్థులంతా ఏడేళ్ల లోపు వయస్సు గలవారే. విద్యార్థుల తల్లిదండ్రుల్లో కొంత మందికి కూడా కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. దీంతో పిల్లలను ఎన్నారై ఆస్పత్రి క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. గ్రామంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతికి అడ్డుకట్ట పడడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారంనాటి లెక్కల ప్రకారం... కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏడు లక్షల 235కి చేరుకుంది. కరోనా వైరస్ కారణంగా 5,869 మంది మృత్యువాత పడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios