ఏపీ సచివాలయంలో పది మందికి కరోనా: ఈ నెల 11న కేబినెట్ వేదిక ఎక్కడ..?
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో సచివాలయంలో పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులకు కోవిడ్ 19 సోకడం ప్రభుత్వ వర్గాలను కలవరపాటుకు గురిచేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో సచివాలయంలో పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులకు కోవిడ్ 19 సోకడం ప్రభుత్వ వర్గాలను కలవరపాటుకు గురిచేస్తోంది.
మరోవైపు ఈ పరిణామాలు ఈ నెల 11న జరగనున్న రాష్ట్ర మంత్రి మండలి సమావేశంపై ప్రభావం చూపే పరిస్ధితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీ ఎలా నిర్వహించాలనే దానిపై సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read:డాక్టర్ అనితారాణి వివాదం: సీఐడికి అప్పగించిన వైఎస్ జగన్
ఇప్పటి వరకు 10 మంది సెక్రటేరియేట్ ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఛాంబర్ ఉండే ఫస్ట్ బ్లాక్‌లో జీఏడీ ఉద్యోగికి, ఆర్‌టీజీఎస్ ఉద్యోగికి కరోనా సోకింది.
సచివాలయంలో పనిచేసే వ్యవసాయ, సహకార శాఖల ఉద్యోగులకు ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించారు పూనం మాలకొండయ్య. అలాగే పరిశ్రమల శాఖ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చారు.
Also Read:ట్విస్ట్: ఆస్పత్రి నుంచి నేరుగా అజ్ఞాతంలోకి డాక్టర్ సుధాకర్
కాగా సచివాలయ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించాలని సీఎస్ నీలం సాహ్నికి ఉద్యోగుల సంఘాలు ఇప్పటికే విజ్ఞప్తి చేశాయి. కరోనా కారణంగా సచివాలయంలో మంత్రి మండలి సమావేశం కుదరని పక్షంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.