Asianet News TeluguAsianet News Telugu

కరోనా వైరస్ : ఏపీలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు ఇవే..

ఇదిలా ఉంటే కర్నూలులో అత్యధికంగా 15 రూరల్ మండలాల్లో కరోనా కేసులు నమోదు కాగా.. నెల్లూరులో 13 మండలాల్లో వైరస్ సోకింది. అటు గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ ప్రధాన మున్సిపల్‌ కార్పొరేషన్‌లలోనే ఏకంగా 146 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 
coronavirus effect Green, red, orange zones in AP
Author
Hyderabad, First Published Apr 15, 2020, 10:50 AM IST
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఈ కేసులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా.. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను, తక్కువగా ఉన్న ప్రాంతాలను విభజించింది.

వాటిలో 41 ప్రాంతాలు రెడ్‌జోన్‌లో ఉండగా.. మరో 45 ప్రదేశాలను ఆరంజ్ జోన్‌లుగా మ్యాపింగ్ చేశారు. మొత్తంగా ఈ రెండు జోన్లలోనూ ఉన్న 86 ప్రాంతాలూ.. గ్రామాలు, పట్టణాల్లో 43 ప్లేస్‌ల చొప్పున ఉన్నాయి. ఇక కరోనా ప్రభావం లేని.. గ్రీన్ జోన్ ప్రాంతాలుగా 590 మండలాలను గుర్తించారు. 

ఇదిలా ఉంటే కర్నూలులో అత్యధికంగా 15 రూరల్ మండలాల్లో కరోనా కేసులు నమోదు కాగా.. నెల్లూరులో 13 మండలాల్లో వైరస్ సోకింది. అటు గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ ప్రధాన మున్సిపల్‌ కార్పొరేషన్‌లలోనే ఏకంగా 146 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

వ్యవసాయ కార్యకలాపాలకు ఏ జోన్‌లోనూ ఆంక్షలు విధించకపోగా.. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మాత్రం వివాహాలకు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేస్తున్నారు. కాగా, రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్లలలో అనుమతులు ఇలా ఉన్నాయి.

రెడ్‌జోన్‌లో టూవీలర్, ప్రైవేటు కారు, ప్రజారవాణా, సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమలు, మాల్స్, బ్యాంకులు, కార్యాలయాలు, వివాహాలు అనుమతి ఉండవు. అటు ఆరెంజ్ జోన్‌లో టూవీలర్‌పై ఒకరికి మాత్రమే అనుమతి ఉండగా.. ప్రైవేటు కారులో డ్రైవర్ కాకుండా మరొకరిని అనుమతిస్తారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios