అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ అంతకంతకూ వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కోవిడ్ వైరస్ మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఇప్పటి వరకు రా్,ట్రంలో 3,092 మంది కరోనా వైరస్ వ్యాధితో మరణించారు. 

తాజాగా గత 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 16 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 13 మంది, నెల్లూరు జిల్లాలో 12 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 11 మంది, అనంతపురం జిల్లాలో ఎనిమిది మంది, కడప జిల్లాలో ఏడుగురు, విశాఖపట్నం జిల్లాలో ఆరుగురు, శ్రీకాకుళం జిల్లాలో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు మృత్యువాత పడ్డారు. గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ముగ్గురేసి మరణించారు. 

తాజాగా గత 24 గంటల్లో ఏపీలో 9544 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 32 వేల 940కి చేరుకుంది. తాజాగా గత 24 గంటల్లో చిత్తూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెద్ద యెత్తున నమోదైంది. చిత్తూరు జిల్లాలో 1103, తూర్పు గోదావరి జిల్లాలో 1312, పశ్చిమ గోదావరి జిల్లాలో 1131 కేసులు నమోదయ్యాయి. 

గత 24 గంటల్లో అనంతపురం జిల్లాలో 704, గుంటూరు జిల్లాలో 358, కడప జిల్లాలో 343, కృష్ణా జిల్లాలో 265, కర్నూలు జిల్లాలో 919, నెల్లూరు జిల్లాలో 761, ప్రకాశం జిల్లాలో 797, శ్రీకాకుళం జిల్లాలో 571, విశాఖపట్నం జిల్లాలో 738, విజయనగరం జిల్లాలో 542 కేసులు రికార్డయ్యాయి. 

ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసులు, మరణాల సంఖ్య ఇలా ఉంది.

అనంతపురం 33307, మరణాలు 262
చిత్తూరు 27676, మరణాలు 304
తూర్పు గోదావరి 46668, మరణాలు 314
గుంటూరు 29166, మరణాలు 322
కడప 19536, మరణాలు 143
కృష్ణా 13501, మరణాలు 240
కర్నూలు 37300, మరణాలు  317
నెల్లూరు 20433, మరణాలు 191
ప్రకాశం 14965, మరణాలు 206
శ్రీకాకుళం 17561, మరణాలు 192
విశాఖపట్నం 28813, మరణాలు 233  
విజయనగరం 14963, మరణాలు 134
పశ్చిమ గోదావరి 28156, మరణాలు 234