Asianet News TeluguAsianet News Telugu

కరోనా వైరస్: అట్టుడుకుతున్న గుంటూరు, ఏపీలో కొత్తగా 47 కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గుంటూరు జిల్లాలో కొత్తగా 21 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదైన జిల్లాగా రికార్డులకెక్కింది.
Coronavirus cases increased in Andhra Pradesh
Author
Amravati, First Published Apr 15, 2020, 7:24 AM IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 47 కోత్త కేసులున నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో కోవిడ్ -19తో అట్టుడుకుతోంది. గుంటూరు జిల్లాలో కొత్తగా 21 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 114కు చేరుకుంది. రాష్ట్రంలో అత్యధికంగా కోవిడ్ -19 కేసులు గుంటూరు జిల్లాలోనే నమోదయ్యాయి. 

ఆ తర్వాత స్థానం కర్నూలు జిల్లా అక్రమించింది. రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 486కు చేరుకుంది. సోమవారం రాత్రి 10 గంటల నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకు గుంటూరు జిల్లాలో 21, కృష్ణాలో 8, కర్నూలు జిల్లాలో 9, అనంతపురం జిల్లాలో 6, కడప జిల్లాలో 2, ప్రకాశం ఒక కేసు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా కేసుల్లో గుంటూరు నగరంలోనే 14 కేసులు నమోద్యయాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 16 మందికి కరోనా వ్యాధి నయమై ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 మంది మరణించారు. 458 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

విజయవాడకు చెందిన 55 ఏళ్ల వ్యక్తి ఈ నెల 12వ తేదీన మరణించాడు. ఆయన ఈ నెల 5వ తేదీన సర్వజనాస్పత్రిలో చేరాడు. అతనికి మధుమేహం, ఆస్తమా ఉన్నాయి. పంజాబ్ నుంచి వచ్చిన వ్యక్తితో సన్నిహింతగా ఉండడం వల్ల అతనికి కరోనా సోకింది. 

నెల్లూరు జిల్లాకు చెందిన వైద్యుడు ఈ నెల 13వ తేదీన కోవిడ్ వ్యాధికి చెన్నైలో చికిత్స పొందుతూ మరణించాడు. ఢిల్లీ నుంచి వచ్చిన కరోనా రోగితో సన్నిహితంగా మెలగడం వల్ల అతనికి కరోనా వైరస్ సోకింది. 
Follow Us:
Download App:
  • android
  • ios