అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కరళా నృత్యం చేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కరోనా వైరస్ తో అట్టుడుకుతోంది. గత 24 గంటల్లో ఒక్క రోజులోనే తూర్పు గోదావరి జిల్లాలో 1086 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 4074 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య ఏపీలో 53,724కు చేరుకుంది. 

గత 24 గంటల్లో ఏపీలో 54 మంది మరణించారు. తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాలో తొమ్మిది మంది చొప్పున మృత్యువాత పడ్డారు. కృష్ణా జిల్లాలో ఏడుగురు, అనంతపురం జిల్లాలో ఆరుగురు మరణించారు. చిత్తూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఐదుగురు చొప్పున మరణించారు. కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాలో ముగ్గురేసి చనిపోయారు. కడప, విజయనగరం జిల్లాల్లో ఒక్కరేసి మరణించారు. దీంతో ఏపీలో మొత్తం ఇప్పటి వరకు 696 మంది మృత్యువాత పడ్డారు. 

గత 24 గంటల్లో అనంతపురం జిల్లాలో 342, చిత్తూరు జిల్లాలో 116, గుంటూరు జిల్లాలో 596, కడప జిల్లాలో 152, కృష్ణా జిల్లాలో  129 మంది కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 559, నెల్లూరు జిల్లాలో 100, ప్రకాశం జిల్లాలో 221, శ్రీకాకుళం జిల్లాలో విశాఖపట్నం జిల్లాలో 102, విజయనగరం జిల్లాలో 56, పశ్చిమ గోదావరి జిల్లాలో 354 కేసులు రికార్డయ్యాయి.

జిల్లాలవారీగా మొత్తం కరోనా వైరస్ కేసులు, మరణాల సంఖ్య

అనంతపురం 5483, మరణాలు 74
చిత్తరు 4763, మరణాలు 51
తూర్పు గోదావరి 7232, మరణాలు 65
గుంటూరు 5494, మరణాలు 58
కడప 2798,  మరణాలు 26
కృష్ణా 3677, మరణాలు 108
కర్నూలు 6604, మరణాలు 126
నెల్లూరు 2486, మరణాలు 21
ప్రకాశం 2085, మరణాలు 34
శ్రీకాకుళం 2830, మరణాలు 29
విశాఖపట్నం 2200, మరణాలు 42
విజయనగరం 1486, మరణాలు 18
పశ్చిమ గోదావరి 2165, మరణాలు 44