తూర్పు గోదావరిపై కరోనా పంజా: ఏపీలో ఒక్క రోజులో 4 వేలకు చేరువలో కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాపై కరోనా పంజా విసిరింది. ఈ జిల్లాలో ఒక్క రోజులో 900కు పైగా కేసులు నమోదయ్యాయి. 12 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఏపీలో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

Coronavirus cases cross 40 thousand in Andhra pradeshm death toll 534

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో ఏపీలో 3,963 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 44609కి చేరుకుింది. తాజాగా గత 24 గంటల్లో కరోనా వైరస్ పాజిటివ్ కారణంగా 52 మంది మృత్యావత పడ్డారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 586కు చేరుకుంది.

గత 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వైరస్ విశ్వరూపం ప్రదర్శించింది. ఈ జిల్లాలో కొత్తగా 994 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో అనంతపురం జిల్లాలో 220, చిత్తూరు జిల్లాలో 343, గుంటూరు జిల్లాలో 214, కడపలో 145 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో కృష్ణా జిల్లాలో 130, కర్నూలు జిల్లాలో 550, నెల్లూరు జిల్లాలో 278, ప్రకాశం జిల్లాలో 266, శ్రీకాకుళం జిల్లాలో 182 కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నం జిల్లాలో 116, విజయనగరం జిల్లాలో 118 పశ్చిమ గోదావరి జిల్లాలో 407 కేసులు నమోదయ్యాయి. ఈ రకంగా ఏపీలోని స్థానికులు మొత్తం 3963 మందికి కరోనా వైరస్ సోకింది. 

గత 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో 12 మంది మృత్యువాత పడ్డారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎనిమిది మంది చొప్పున మరణించారు. అనంతపురం జిల్లాలో ఏడుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు మరణించారు. చిత్తూరు, కడప, విజయనగరం జిల్లాల్లో ఒక్కరేసి మృత్యువాత పడ్డారు. 

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో గానీ, విదేశాల నుంచి వచ్చినవారిలో గానీ ఏ విధమైన కరోనా కేసులు నమోదు కాలేదు.

ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసులు, మరణాలు

అనంతపురం 4504, మరణాలు 65
చిత్తూరు 4207, మరణాలు 44
తూర్పు గోదావరి 5499, మరణాలు 46
గుంటూరు 4544, మరణాలు 47 
కడప 2420, మరణాలు 22
కృష్ణా 3151, మరణాలు 94
కర్నూలు 5681, మరణాలు 116
నెల్లూరు 1995, మరణాలు 21
ప్రకాశం 1714, మరణాలు 30
శ్రీకాకుళం 2034, మరణాలు 16
విశాఖపట్నం 1832, మరణాలు 30
విజయనగరం 1189, మరణాలు 14
పశ్చిమ గోదావరి 2944, మరమాలు 41

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios