అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. నానాటికీ విజృంభిస్తోంది. ఒక్క రోజులో 2 వేలకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా గత 24 గంటల్లో ఏపీలో మొత్తం 1935 కేసులు నమోదయ్యాయి. ఏపీ స్థానికుల్లో 1919 మందికి కరోనా వైరస్ పాజిటివ్ రాగా, విదేశాల నుంచి వచ్చినవారిలో 13 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. విదేశాల నుంచి వచ్చినవారిలో ముగ్గురికి కరోనా వైరస్ సోకింది. దీంతో గత 24 గంటల్లో మొత్తం 1935 కేసులు రికార్డయ్యాయి. 

గత 24 గంటల్లో ఏపీలో 36 మంది కోవిడ్ -19తో మృత్యువాత పడ్డారు. అనంతపురం జిల్లాలో ఆరుగురు మరణించారు. కర్నూలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నలుగురేసి మరణించారు. చిత్తూరు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురేసి మృత్యువాత పడ్డారు. కడప, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరేసి మరణించారు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కరేసి కరోనా వైరస్ వ్యాధితో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 365కి చేరుకుంది. 

గత 24 గంటల్లో 19,247 శాంపిల్స్ ను పరీక్షించగా 1,919 మందికి రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో 1030 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 11,73,096 శాంపిల్స్ పరీక్షించారు. రాష్ట్రంలో మొత్తం 14,274 మంది ఆస్పత్రుల్లో కరోనా వ్యాధికి చికిత్స పొందుతున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో ఇప్పటి వరకు మొత్తం 2416 మందికి కరోనా వైరస్ సోకింది. విదేశాల నుంచి వచ్చినవారిలో మొత్తం 432 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. 

జిల్లాలవారీగా మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, మరమణాలు

అనంతపురం 3466, మరణాలు 30
చిత్తూరు 2836, మరణాలు 24
తూర్పు గోదావరి 2955, మరణాలు 12
గుంటూరు 3210, మరణాలు 32
కడప 1870, మరణాలు 7
కృష్ణా 2615, మరణాలు 83
కర్నూలు 3654, మరణాలు 105
కర్నూలు 3654, మరణాలు 105
నెల్లూరు 1254, మరణాలు 12
ప్రకాశం 1206, మరణాలు 8
శ్రీకాకుళం 1199, మరణాలు 14
విశాఖపట్నం 1461, మరణాలు 16
విజయనగరం 702, మరణాలు 8
పశ్చిమ గోదావరి 1827, మరణాలు 14