ఏపీపై కరోనా పంజా: 12 గంటల్లో 12 కొత్త కేసులు, మొత్తం 432కి చేరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం నాడు రాత్రి 9 గంటల నుండి సోమవారం నాడు ఉదయానికి కొత్తగా 12 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 432కి చేరుకొన్నాయి.
corona virus:12 more cases reports in Andhra pradesh, total rises to 432
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం నాడు రాత్రి 9 గంటల నుండి సోమవారం నాడు ఉదయానికి కొత్తగా 12 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 432కి చేరుకొన్నాయి.

ఆదివారం నాడు రాత్రి నుండి సోమవారం ఉదయం 9 గంటల వరకు 12 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో గుంటూరులో అత్యధికంగా 8, చిత్తూరులో రెండు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదైనట్టుగా అధికారులు ప్రకటించారు.12 గంటల్లో 12 కొత్త కేసులు  నమోదైనట్టుగా ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

రాష్ట్రంలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 90 కేసులు నమోదయ్యాయి. ఆదివారం నాడు రాత్రి వరకు కర్నూల్ జిల్లాలో అత్యధిక కేసులు ఉండేవి. అయితే సోమవారం నాడు ఉదయానికి కర్నూల్ జిల్లాను వెనక్కి నెట్టి గుంటూరు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.
 
గుంటూరు తర్వాతి స్థానంలో కర్నూల్ జిల్లా నిలిచింది. కర్నూల్ జిల్లాలో 84 కేసులు నమోదయ్యాయి. మూడో స్థానంలో నెల్లూరు జిల్లా నిలిచింది.ఈ జిల్లాలో 52 కేసులు నమోదైనట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రకాశం జిల్లాలో 41 కేసులు నమోదైనట్టుగా అధికారులు తేల్చి చెప్పారు.

ఏపీలో 420కి చేరిన కేసులు: లాక్‌డౌన్, ఏ జిల్లాల్లో ఏవిధంగా... స్పెషల్ రిపోర్ట్also read:

రాష్ట్రంలో తొలుత నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఇతర జిల్లాల్లో కూడ ఈ కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.కరోనా వైరస్ సోకి ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత నయమై సుమారు 12 మంది ఇంటికి తిరిగి వెళ్లారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios