కరోనా పాజిటివ్ వచ్చిన ఓ మహిళ 108 అంబులెన్స్ లోనే ప్రసవించిన ఘటన ఏలూరులో చోటు చేసుకుంది. అంబులెన్స్ సిబ్బంది సహకారంతో సుఖప్రసవం అయ్యింది. తల్లీ బిడ్డా క్షేమం  అని తెలిపారు.

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలం వెంకట్రావు పాలెంకు చెందిన మంగం సావిత్రి (35) 108 వాహనంలోనే ప్రసవించింది. రెండు రోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో సావిత్రికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యిది. 

కాగా గత అర్థరాత్రి పురిటి నొప్పులతో రావడంతో ఏలూరు ఆస్పత్రికి తరలిస్తుండగా పూళ్ళ వద్ద సుఖప్రసవం జరిగింది. ఈఎంటీ రాజు, పైలెట్ నీలిపాల దినేష్ లు సావిత్రికి పురుడు పోశారు. ప్రస్తుతం తల్లి, బాబు క్షేమంగా ఉన్నారు. ఇరువురిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.