ఏపీలో కరోనా విజృంభణ: 3 లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏపీలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువైంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతునే ఉంది. ఏపీలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువలో ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 6780 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 96 వేల 609కి చేరుకుంది.
ఏపీలో కొత్తగా గత 24 గంటల్లో ప్రకాశం జిల్లాలో 13 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 10 మంది, చిత్తూరు జిల్లాలో ఎనిమిది మంది, గుంటూరు జిల్లాలో ఏడుగురు మరణించారు. కడప జిల్లాలో కూడా ఏడుగురు మృత్యువాత పడ్డారు. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆరుగురు చొప్పున చనిపోయారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, కృష్ణా జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు కోరనా వైరస్ తో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2732కు చేరుకుంది.
రాష్ట్రంలో నమోదైన మొత్తం 2,93,714 కేసులకు గాను 2,06స205 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం 84,777 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
గత 24 గంటల్లో అనంతపురం జిల్లాలో 535, చిత్తూరు జిల్లాలో 458, తూర్పు గోదావరి జిల్లాలో 911, గుంటూరు జిల్లాలో 776, కడప జిల్లాలో 523 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 135, కర్నూలు జిల్లాలో 372, నెల్లూరు జిల్లాలో 481, ప్రకాశం జిల్లాలో 357, శ్రీకాకుళం జిల్లాలో 527, విశాఖపట్నం జిల్లాలో 519 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో 462, పశ్చిమ గోదావరి జిల్లాలో 724 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.
ఏపీలో జిల్లాలవారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు
అనంతపురం 30062, మరణాలు 229
చిత్తూరు 23917, మరమాలు 243
తూర్పు గోదావరి 41204, మరణాలు 286
గుంటూరు 26915, మరణాలు 297
కడప 17331, మరణాలు 124
కృష్ణా 12479, మరణాలు 229
కర్నూలు 33952, మరణాలు297
నెల్లూరు 17645, మరమాలు 148
ప్రకాశం 12223, మరణాలు 174
శ్రీకాకుళం 15258, మరణాలు 171
విశాఖపట్నం 25327, మరణాలు 211
విజయనగరం 13095, మరణాలు 121
పశ్చిమ గోదావరి 24306, మరణాలు 202