విశాఖపట్టణం: కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ యువకుడు  ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన విశాఖపట్టణం జిల్లాలో చోటు చేసుకొంది. మర్చంట్ నేవీలో సీ మెన్ గా  పనిచేస్తున్న సునీల్ కి కరోనా సోకింది. దీంతో ఆయన విశాఖప్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరాడు. 

సునీల్ పై ఇటీవలనే ఓ అమ్మాయి కేసు పెట్టింది. పెళ్లి చేసుకోవాలని భావించిన అమ్మాయే సునీల్ పై కేసు పెట్టింది. ఈ తరుణంలోనే ఆయనకు కరోనా సోకింది. దీంతో ఆయన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరోనా రావడం, అమ్మాయి తనపై కేసు పెట్టడంతో  మనోవేదనకు గురైన సునీల్ ఆత్మహత్య చేసుకొన్నాడని  మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దీంతో శనివారం నాడు నుండి ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ను విధించింది. ఈ నిబంధనలను పాటించని  వారిపై కేసులు నమోదు చేస్తామని  ప్రభతు్వం హెచ్చరించింది.