Asianet News TeluguAsianet News Telugu

కరోనా కాదు భయమే ప్రాణం తీసింది... విశాఖలో కోవిడ్ రోగి ఆత్మహత్య

విమ్స్(విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) లో వరుసగా కరోనా రోగుల ఆత్మహత్యలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. 

corona patient commit suicide at visakhapatnam akp
Author
Visakhapatnam, First Published Jun 3, 2021, 11:12 AM IST

విశాఖపట్నం: కరోనా భయంతో ఓ వ్యక్తి హాస్పిటల్ భవనం పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. విమ్స్(విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) లో వరుసగా ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కొద్దిరోజుల క్రితమే విమ్స్ హాస్పిటల్ భవనం పైనుండి దూకి ఓ కరోనా పేషెంట్ ఆత్మహత్య చేసుకోగా తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది.  

తాజా దుర్ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... విశాఖలోని భీమునిపట్నంకు చెందిన వేణుబాబు(37) కరోనా బారిన పడ్డాడు. దీంతో అతడు మెరుగైన చికిత్స కోసం జూన్ 1వ తేదీన విమ్స్ లో చేరాడు. ఇలా చికిత్స పొందుతున్న అతడు కరోనా తనను ఏం చేస్తుందోనన్న ఆందోళనకు గురయినట్లున్నాడు. దీంతో పూర్తిగా ఆత్మస్తైర్యం కోల్పోయిన అతడు దారుణ నిర్ణయం తీసుకున్నాడు. 

read more  ఏపీలో కోటి మందికి కరోనా వ్యాక్సిన్..: వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ప్రకటన

ఇవాళ(గురువారం) ఉదయంవేణుబాబు హాస్పిటల్ భవనం పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికి భయంతో బలవన్మరణాపికి పాల్పడ్డాడని విమ్స్ సిబ్బంది చెబుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు వరుసగా జరగడంతో అధికారులను కలవరపెడుతోంది. 

ఇటీవలే కరోనాలో బాధపడుతూ విమ్స్ లో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి కూడా ఇలాగే  భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. విమ్స్ భవనంపై నుండి దూకి వి.సుధాకర్ ( 49 ) అనే కోవిడ్ రోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.  

Follow Us:
Download App:
  • android
  • ios