కరోనా దెబ్బ: ఇక ఫ్రీ గా తిరుమల వెంకన్న ప్రసాదం

భక్తులనెవ్వరిని అనుమతించకపోవడంతో... తిరుమల గిరులన్నీ  బోసిపోయాయి. భక్తులకోసం ఇప్పటికే తయారు చేసి ఉంచిన స్వామివారి ప్రసాదం తిరుపతి లడ్డులు ఇప్పుడు రెండు లక్షలు మిగిలిపోయాయి. 

Corona Effect: TTD to freely distribute Tirupati Laddu

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచదేశాలు వణికి పోతున్నాయి. కరోనా వైరస్ దెబ్బకు పేద, ధనిక అనే తేడా చూపెట్టకుండా అన్ని దేశాలను, ప్రజలను వణికిస్తోంది. ఆ వైరస్ పేరు చెబితేనే ప్రజలు వణికి పోతున్నారు. ఈ వైరస్ ఎంతలా ప్రభావం చూపుతుందంటే... ఏకంగా దేశాల మంత్రులను కూడా వదలడం లేదు. 

కెనడా ప్రధాని భార్యకు కూడా ఈ కరోనా వైరస్ సోకింది. ఇరాన్ మంత్రికి సోకింది, వివిధ దేశాల్లోని ఎంపీలు సైతం ఈ వైరస్ బారిన పడ్డారంటేనే ఈ వైరస్ ఏ లెవెల్ లో కరాళ నృత్యం చేస్తుందో అర్థమవుతుంది. 

ఇక ఈ వైరస్ కి ఇప్పటికీ మందు లేని నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ నివారణకు మొగ్గు చూపుతూ ఆంక్షలను విధిస్తున్నాయి. జనసమ్మర్ధమైన ప్రదేశాలను మూసివేస్తూ ప్రజలను ఇండ్లలోంచి బయటకు రానీయకుండా తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నాయి. 

ఇక కరోనా దెబ్బకు తిరుమల వేంకటేశుని ఆలయాన్ని కూడా మూసివేసిన విషయం తెలిసిందే! స్వామివారి నిత్య పూజలకు ధూపదీప నైవేద్యాలకు ఎటువంటి బ్రేక్ లేకున్నప్పటికీ... భక్తులను మాత్రం కొండపైకి అనుమతించడం లేదు. 

ఇక భక్తులనెవ్వరిని అనుమతించకపోవడంతో... తిరుమల గిరులన్నీ  బోసిపోయాయి. భక్తులకోసం ఇప్పటికే తయారు చేసి ఉంచిన స్వామివారి ప్రసాదం తిరుపతి లడ్డులు ఇప్పుడు రెండు లక్షలు మిగిలిపోయాయి. 

ఆ ప్రసాదమంటే వరల్డ్ ఫేమస్. ఆ లడ్డులు ఇప్పుడు అక్కడ అలా మిగిలిపోయాయని తెలుసుకొని అబ్బా మాకిస్తే బావుణ్ణు అనుకుంటున్నారు. కానీ ఎం చేస్తాం భక్తులెవ్వరికీ అక్కడికి అనుమతి లేకపాయె. 

ఇలా లడ్డులు మిగిలిపోవడంతో ఆ లడ్డులను ఉచితంగా ఇచ్చేయడానికి టీటీడీ ప్లాన్ చేసింది. వెంటనే మనకు కూడా ఇచ్చేస్తారనుకోకండి. కేవలం టీటీడీ ఉద్యోగులకు అక్కడ పని చేసే ప్రతి ఒక్కరికి వీటిని ఉగాది కానుకగా పంచిపెట్టేందుకు దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకుంది. 

ఇకపోతే కరోనా వైరస్ నేపథ్యంలో ఆగమ శాస్త్ర పండితుల సూచనల మేరకు ఈ నెల 26వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ధన్వంతరి యాగం నిర్వహించనున్నారు. అయితే అంతకుముందుగానే తొమ్మిది రోజుల పాటు ఆరోగ్య జపాన్ని చేయాలని అధికారులు నిర్ణయించారు.

Also Read:అమల్లోకి ఆదేశాలు, భక్తుల ప్రవేశం నిలిపివేత: తిరుమల గిరుల్లో కర్ఫ్యూ వాతావరణం

తిరుమలలోని ఆస్థాన మండపం వేదికగా నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన రుత్విక్కులను రప్పించి, నాలుగు వేదాల్లో ఉన్నటువంటి మంత్రాలతో ఈ జపాన్ని కొనసాగిస్తారు. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు సంబంధించిన రుత్విక్కులు ఆరోగ్య జపాన్ని ఈ నెల 25 వరకు కొనసాగించనున్నారు.

26వ తేదీన తిరుమల ధర్మగిరి వద్ద వున్న వేద పాఠశాలలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి, మంత్రాలయం పీఠాధిపతి ఆధ్వర్యంలో ఈ యాగాన్ని నిర్వహించనున్నారు.

ఆలయం మూసివేయడం లేదు.. భక్తుల ప్రవేశమే నిలిపివేత: టీటీడీ ఈవో

ధన్వంతరి యాగం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు సుఖశాంతి, ఆరోగ్యం కలుగుతుందని పండితులు అంటున్నారు. గతంలోనూ విపత్తుల సమయంలోనూ టీటీడీ ఇలాంటి యాగాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios