Asianet News TeluguAsianet News Telugu

విజయవాడ జీజీహెచ్‌పై కరోనా పంజా.. పెద్ద సంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బందికి సోకిన వైరస్

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి కలకలం రేపుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. తాజాగా విజయవాడ జీజీహెచ్‌‌పై కరోనా పంజా విసిరింది. పెద్ద సంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బంది కరోనా బారినపడ్డారు.

corona cases rising in vijayawada government hospital
Author
Vijayawada, First Published Jan 22, 2022, 2:32 PM IST

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి కలకలం రేపుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. తాజాగా విజయవాడ జీజీహెచ్‌‌పై (Vijayawada GGH) కరోనా పంజా విసిరింది. పెద్ద సంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బంది కరోనా బారినపడ్డారు. కొత్త, పాత ఆస్పత్రులలో 100 మంది వరకు కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయినట్టుగా సమాచారం. ఈ రెండు ఆస్పత్రులలో దాదాపు 40 విభాగాల వైద్య సేవలు కొనసాగుతున్నాయి. దాదాపు 800 వరకు వైద్య సిబ్బంది ఉన్నారు. ప్రతి డిపార్ట్‌మెంట్‌‌లో వైద్య సిబ్బంది కొరత కనిపిస్తుంది. దీంతో జిల్లాల నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లను రప్పించాలంటూ ఆస్పత్రి వర్గాలు ఉన్నతాధికారులను కోరుతున్నారు. 

అయితే ఆస్పత్రిలో వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చూసుకుంటున్నారు. అంతేకాకుండా కోవిడ్ కేర్‌లో పెషేంట్లకు చికిత్సకు ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. వైద్య సేవలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందనే ఆందోళన వ్యక్తం అవుతుంది.

మరోవైపు ఏపీలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ప్రభుత్వం కోవిడ్ కట్టడికి నైట్ కర్ఫ్యూ, ఇతర ఆంక్షలు అమలు చేస్తున్న కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 44,516 శాంపిల్స్ ని పరీక్షించగా 13,212 మందికి కరోనా సోకినట్లుగా ఏపీ ఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య  21,53,268కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 64,136 గా ఉంది. ఇప్పటివరకు ఏపీలో కరోనాతో 14,532 మంది మరణించారు.

ముఖ్యమంగా అనంతపురం, విశాఖపట్నం, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. విశాఖ జిల్లాలో  2, 244 కొత్త కేసులు, చిత్తూరు జిల్లాలో 1, 585 కేసులు వెలుగుచూశాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios