Asianet News TeluguAsianet News Telugu

తిరుమల వేద పాఠశాలలో కరోనా కలకలం.. ప్రత్యేక దృష్టిపెట్టిన మంత్రి...

తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాలలో కరోనా కలకలంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అలెర్ట్ అయ్యారు. చిత్తూరు జిల్లాలో కరోనాకేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని నివారణ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. 

corona cases in tirumala dharmagiri vedapatashala - bsb
Author
hyderabad, First Published Mar 16, 2021, 2:29 PM IST

తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాలలో కరోనా కలకలంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అలెర్ట్ అయ్యారు. చిత్తూరు జిల్లాలో కరోనాకేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని నివారణ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. 

కరోనా నివారణకుతీసుకోవలిసిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాదికారులతో సమీక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లా DMHO డాక్టర్ పెంచలయ్యతో మంత్రి ఆళ్ల నాని ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కరోనా కేసులు పెరగడం మీద తిరుపతి స్విమ్స్, రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్స్,
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి అప్రమత్తం చేశారు. తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో కరోనా సోకిన ఆరుగురు విద్యార్థులు, నలుగురు అధ్యాపకులను మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ కి తరలించారు.

ప్రస్తుతం తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ లో 57మంది విద్యార్థులతో పాటు మరో 10మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. కరోనా సోకిన బాధితులకు మెరుగైన వైద్యం అందించడానికి స్విమ్స్, రుయా హాస్పిటల్స్ లో 1000బెడ్స్, మందులు అందుబాటులో ఉంచామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు.

కరోనాతో హోమ్ క్వారంటైన్ లో ఉన్న బాధితులను ప్రతి రోజు డాక్టర్స్, వైద్య సిబ్బంది పర్యవేక్షణ చేస్తున్నారు. హోమ్ క్వారంటైన్ లో కరోనా బాధితులకు మెడికల్ కిట్స్ అందిస్తున్నాం. కరోనా సోకిన ప్రాంతంలో శానిటేషన్ చేస్తున్నాం.

ప్రతి 50ఇళ్లకు మెడికల్ టీమ్ సర్వే చేపట్టింది. ఆశ వర్కర్స్, వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ పేర్లు సేకరిస్తున్నారు. ప్రస్తుతం స్విమ్స్, రుయా హాస్పిటల్స్ లో 120మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని మంత్రి తెలిపారు.

అంతేకాదు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 300మంది కరోనా బాధితులు హోమ్ క్వారంటైన్ ఉన్నారని, కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. 

జిల్లాలో డివిజన్ స్థాయి, మండల స్థాయిలో టాస్క్ పోర్స్ టీమ్స్ ఏర్పాటు చేసామని,  ప్రతి రోజు 2వేల మంది కరోనా పరీక్షలు చేస్తున్నామని, అవసరం అయిన మందులు అందుబాటులో ఉంచామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. 

ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 420కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయని, ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. 

కరోనా ఉదృతి పెరుగుతున్న క్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కూడ చాలా అప్రమత్తంగా ఉందని తెలిపారు. కరోనా నివారణకు ప్రభుత్వం చేస్తున్న యజ్ఞంలో ప్రజలు కూడ భాగస్వామిలై కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి సహకరించాలన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios