Asianet News TeluguAsianet News Telugu

మీ ఇంట్లో వివాహేతర సంబంధాలున్నాయా? ఒకటి కంటే ఎక్కువ లైంగిక సంబంధాలు ఉన్నాయా?.. సర్వే ప్రశ్నలు వివాదాస్పదం...

ఏపీ పోలీస్ శాఖ చేపట్టిన ఓ సర్వే లోని ప్రశ్నలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఇంటింటికి తిరిగి వివాహేతర సంబంధాలు, లైంగిక సంబంధాలు, నేరాల గురించి వివరాలు సేకరిస్తున్నారు.

Controversial questions in police department survey in Andhra Pradesh
Author
First Published Dec 22, 2022, 7:22 AM IST

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఓ సర్వే లోని ప్రశ్నలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతున్నాయి.  ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ఓ సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో అడుగుతున్న ప్రశ్నలు  విచిత్రంగా ఉండి,  ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఏంటంటే… ‘మీ ఇంట్లో ఎవరికైనా ఒకటికంటే ఎక్కువ పెళ్లిళ్లు అయ్యాయా?, ఇంట్లోనే వ్యక్తులు ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ లైంగిక సంబంధాలు కలిగి ఉన్నారా?, మీ ఇంట్లో ఎవరికైనా వివాహేతర సంబంధాలు ఉన్నాయా?..  అని అడుగుతున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ ఈ సర్వే నిర్వహిస్తోంది. పాత విడుదల కారణంగా నేరాలకు దారితీసే అవకాశం.. వివరాల సేకరణ’ పేరుతో ఇంటింటికి వెళ్లి ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు. మహిళా పోలీసులు వాలంటీర్లతో కలిసి ఈ సర్వే కోసం వెడుతున్నారు. తమ పరిధిలోని అన్ని ఇళ్లకు వెళ్లి ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు రాబడుతున్నారు. కాగా ఈ ప్రశ్నలు అడిగిన వెంటనే ఆ ఇళ్లలో నుంచి వ్యతిరేకత సహజంగానే ఎదురవుతోంది. కొన్ని చోట్ల  ఇదేం ప్రశ్న అడగాల్సినవేనా అంటూ ఆగ్రహానికి గురి అవుతున్నారు. 

ఏపీలో ఒమిక్రాన్ బీఎఫ్ .7 వేరియంట్ తొలి కేసు.. కోనసీమ మహిళలో గుర్తింపు

దీంతో,  వాలంటీర్ల తో పాటు వెళ్లి, ప్రశ్నలు అడుగుతున్న మహిళా పోలీసులు కొంత ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రశ్నలతో పాటు.. సంబంధిత ఇంట్లోనే వ్యక్తులతో చెందిన ఆస్తి వివరాలు,  గృహహింస కేసులు, సరిహద్దు వివాదాలు, మద్యం అలవాటు, కుల, మత రాజకీయ పరమైన వివాదాలు, బహిరంగ మద్యపానం,  ఈవ్ టీజీంగ్ లాంటి కేసులేమైనా ఉన్నాయా అని వివరాలు సేకరిస్తున్నారు. ఈ సర్వేలో మొత్తం 12 రకాల విషయాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగి, వివరాలు తెలుసుకుంటున్నారు. సేకరించిన సమాచారం అంతా ఒక నమూనాలో రాసి రోజు సాయంత్రం ఏడు గంటలకు సంబంధిత  ఎస్ హెచ్ఓకి ఇస్తున్నారు. ఈ ప్రక్రియ గత కొద్ది రోజులుగా జరుగుతోంది.

ఈ సర్వే మీద ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల్లో వేధింపులకు పాల్పడేందుకు.. ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులను, రాజకీయ ప్రత్యర్థులను, గిట్టనివారి వేదించేందుకు.. వినకపోతే అక్రమంగా కేసులలో ఇరికించడానికి ఇలాంటి వివరాలు సేకరిస్తున్నారు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రజలకు సంబంధించిన అత్యంత సున్నితమైన వ్యక్తిగత వివరాలను పోలీస్ శాఖ ఎందుకు సేకరించాలని ప్రశ్నిస్తున్నాయి. ఈ సమాచారమంతా వాలంటీర్ల వద్ద ఉంటుందని. దీంతో వీరు ఎన్నికల్లో బెదిరింపులకు పాల్పడితే అవకాశాలు ఉంటాయని  ఆరోపిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios