Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో ఒమిక్రాన్ బీఎఫ్ .7 వేరియంట్ తొలి కేసు.. కోనసీమ మహిళలో గుర్తింపు

ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ ఎంటర్ అయినట్లుగా తెలుస్తోంది. కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం నేదనూరి సావరానికి చెందిన మహిళలో ఈ వేరియంట్‌ను నిర్ధారించారు అధికారులు. 
 

ap report first omicron bf 7 variant case
Author
First Published Dec 21, 2022, 9:54 PM IST

చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ భారత్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే గుజరాత్, ఒడిషాలలో కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ వేరియంట్ ఎంటర్ అయినట్లుగా తెలుస్తోంది. కోనసీమ జిల్లాకు చెందిన ఓ మహిళకు ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ నిర్థారణ అయ్యింది. ఆ మహిళది అయినవిల్లి మండలం నేదనూరి సావరంగా అధికారులు గుర్తించారు. ఈ నెల 19న కువైట్ నుంచి విజయవాడ మీదుగా కారులో వచ్చింది సదరు మహిళ. గన్నవరం విమానాశ్రయంలో మహిళ నుంచి శాంపిల్స్ సేకరించారు వైద్యులు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి ఒమిక్రాన్ బీఎఫ్.7గా నిర్ధారించారు వైద్యులు. దీంతో మహిళ కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కోనసీమ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని నివేదించింది. 

అంతకుముందు గుజరాత్‌లోని వడోదరాలో ఎన్ఆర్ఐ మహిళకు బీఎఫ్ 7 వేరియంట్ సోకినట్లుగా తెలుస్తోంది. దీంతో దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. సదరు ఎన్ఆర్ఐ మహిళతో పాటు మరో ముగ్గురిని అధికారులు ఐసోలేషన్‌కు తరలించారు. అలాగే ఒడిశాలో మరొకరికి కూడా బీఎఫ్ 7 వేరియంట్ నిర్థారణ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ALso Read: భారత్‌లోకి ఎంటరైన ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్.. గుజరాత్, ఒడిశాలలో కేసులు

విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు ఎయిర్‌పోర్టుల్లోనే స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. ఎలాంటి పరిస్ధితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని కేంద్రం స్పష్టం చేసింది. కరోనాపై అప్రమత్తంగా వుండాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. రద్దీగా వుండే ప్రాంతాల్లో మాస్క్‌లు తప్పనిసరి చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios