Asianet News TeluguAsianet News Telugu

చెల్లి అని చెప్పి.. వివాహేతర సంబంధం.. చివరకి సస్పెండయి.. ఓ పోలీసు బాగోతం..

హర్షవర్ధన్ రాజుకు కొన్నేళ్ల క్రితం ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ తో పరిచయం ఏర్పడింది. అది Extramarital affairకి దారి తీసింది. ఆమెను తరచూ ఇంటికి తీసుకు వెళ్లేవాడు. ఈ విషయమై భార్య అడిగితే తన చెల్లి అని చెప్పేవాడు. 

constable suspended over illegal affair with lady constable in anantapur
Author
Hyderabad, First Published Oct 27, 2021, 7:28 AM IST

అనంతపురం : వివాహేతర సంబంధం పెట్టుకుని పోలీస్ శాఖ పరువు తీసిన కానిస్టేబుల్ హర్షవర్ధన్ రాజుతో పాటు మహిళా కానిస్టేబుల్ ను ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప సస్పెండ్ చేశారు. కనగానపల్లి మండలం తగరకుంటకు చెందిన హర్షవర్ధన్ రాజు(2018వ బ్యాచ్) అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు.

ఈయనకు కల్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన ఓ మహిళతో రెండేళ్ల క్రితం వివాహం అయ్యింది. తల్లిదండ్రులకు ఆమె ఒక్కరే సంతానం. దీంతో కట్న కానుకల కింద రూ.20 లక్షల నగదు, పది తులాల బంగారం, కారు ఇచ్చినట్లు సమాచారం. 

కాగా, హర్షవర్ధన్ రాజుకు కొన్నేళ్ల క్రితం ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ తో పరిచయం ఏర్పడింది. అది Extramarital affairకి దారి తీసింది. ఆమెను తరచూ ఇంటికి తీసుకు వెళ్లేవాడు. ఈ విషయమై భార్య అడిగితే తన చెల్లి అని చెప్పేవాడు. 

ఓ రోజు గట్టిగా నిలదీయగా.. ‘Police Departmentలో ఇటువంటివి సహజం. లైట్ గా తీసుకోవాలి’ అంటూ సమాధానమిచ్చాడు. దీంతో విసిగిపోయిన భార్య పుట్టింటకి వెళ్లింది. భార్యను తిరిగి తీసుకురావడానికి ఆయన ఏనాడూ వెళ్లలేదు. చివరకు పెద్దలు పంచాయతీ చేసినా ప్రవర్తన మార్చుకోలేదు. 

దీంతో Victim, ఆమె తండ్రి బ్రహ్మ సముద్రం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఎస్పీ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. దీంతో విచారణకు ఎస్పీ ఆదేశించారు. విచారణాధికారుల నివేదిక ఆధారంగా హర్షవర్ధన్ రాజుతో పాటు మహిళా కానిస్టేబుల్ మీద కూడా Suspension వేటు వేశారు. 

రహదారి లేదు.. అంబులెన్స్ రాదు.. విశాఖ ఏజెన్సీలో నిండుగర్భిణి పాపకు జన్మనిచ్చి మృతి

డెడ్‌బాడీతో  ఆందోళన..
ఇదిలా ఉండగా.. అనంతపురంలో మంగళవారం ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. జిల్లాలోని Bathalapalli mro కార్యాలయంలో వృద్దురాలి డెడ్‌బాడీతో బాధిత కుటుంబసభ్యులు ఆందోళనకు దిగడంతో  తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మృతురాలి కుటుంబసభ్యులకు పోలీసులు నచ్చజెప్పడంతో చివరకు బాధిత కుటుంబసభ్యులు ఆందోళనను విరమించారు.

Anantapur జిల్లాలోని  బత్తలపల్లి మండలం Jalalpuram గ్రామానికి చెందిన Laxmi Devi, peddanna భార్యాభర్తలు. అనారోగ్యంతో పెద్దన్న ఏడేళ్ల క్రితం మరణించాడు. పెద్దన్న పేరున ఉన్న భూమిని తన పేరున మార్చాలని పెద్దన్న భార్య లక్ష్మిదేవి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతుంది. అయినా కూడ ఆమె పేరున భూమి మార్పిడి జరగలేదు.  తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది.

దీంతో మనోవేదనకు గురైన లక్ష్మిదేవి మరణించిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. లక్ష్మీదేవి డెడ్‌బాడీని బత్తలపల్లి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చి ఆందోళన చేశారు. తహసీల్దార్ టేబుల్‌పై లక్ష్మీదేవి డెడ్‌బాడీని ఉంచి నిరసన వ్యక్తం చేశారు.లక్ష్మీదేవి డెడ్ బాడీని కార్యాలయంలోకి తీసుకురాకుండా కొందరు ఉద్యోగులు అడ్డుకొన్నారు. అయితే మృతురాలి కుటుంబసభ్యులు వారిని నెట్టుకుంటూ డెడ్‌బాడీని తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లారు.

ఎమ్మార్వో టేబుల్ పై డెడ్ బాడీ పెట్టి ఆందోళన చేశారు. ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొని బాధిత కుటుంబసభ్యులకు నచ్చజెప్పారు. చివరకు బాధిత కుటుంబసభ్యులు ఆందోళన విరమించి డెడ్‌బాడీని తీసుకెళ్లారు.

Follow Us:
Download App:
  • android
  • ios